OTTలో చాలా వెరైటీ కామెడీ, థ్రిల్ల‌ర్.. డోంట్ మిస్‌! తెలుగులోనూ

ఇటీవ‌ల థియేట‌ర్‌లో విడుద‌ల కాకుండా డైరెక్టు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన బాలీవుడ్‌ చిత్రం బ్లాకౌట్. 12th ఫెయిల్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విక్రాంత్ మెస్సె క‌థానాయ‌క‌డు.


ఇటీవ‌ల థియేట‌ర్‌లో విడుద‌ల కాకుండా డైరెక్టు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన బాలీవుడ్‌ చిత్రం బ్లాకౌట్ (Blackout).. 12th ఫెయిల్ సినిమాతో దేశ‌వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న విక్రాంత్ మెస్సె క‌థానాయ‌క‌డు. రుహానీ శ‌ర్మ‌, మౌనీ రాయ్‌, సునీల్ గ్రోవ‌ర్‌, జిష్టు సేన్ గుప్తా వంటి పేరున్న తార‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దేవంగ్ భ‌స‌ర్ ద‌ర్శ‌కత్వం (Devang Bhavsar) వ‌హించారు. ఓటీటీలో డిఫ‌రెంట్ టైప్ జాన‌ర్ చిత్రాల కోసం చూస్తున్న వారికి ఈ చిత్రం బాగా న‌చ్చే అవ‌కాశం ఉంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. సినిమా అంతా ఒక రాత్రిలో జ‌రిగే క‌థ‌గా ఉంటుంది. పుణే న‌గ‌రంలో ఓ దొంగ‌ల ముఠా వేరైటీగా విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల‌పై దాడి చేసి అక్క‌డ విధుల్లో ఉన్న‌వారికి మ‌త్తు ఇచ్చి సృహ కోల్పోయేలా చేస్తారు. ఆ త‌ర్వాత అంత‌టా క‌రెంటు బంద్ చేసి బ్యాంకుల్లో దొంగ‌తనాలు చేస్తుంటారు. అలాంటి ఓ రోజు రిపోర్ట‌ర్ అయిన హీరో భార్య చెప్పిన స‌రుకులు తేవ‌డానికి రోడ్డు పైకి వ‌స్తాడు. కారులో వెళుతుండ‌గా దొంగ‌లు రాబ‌రీ చేసి డ‌బ్బులు, న‌గ‌ల‌తో ప‌రార‌వుతున్న వ్యాన్ బోల్తా ప‌డి ఉండ‌డం క‌నిపిస్తుంది.

హీరో అక్క‌డికి వెళ్లి చూడ‌గా అందులో దొంగ‌లంతా చ‌నిపోయి ఉండ‌డంతో అక్క‌డ ఉన్న డ‌బ్బుల్లో ఓ పెట్టె తీసుకుని త‌న కారులో పెట్టుకుని వెళ్లి పోతాడు. ఈ క్ర‌మంలో హీరో కారు స‌డ‌న్‌గా ఓ వ్య‌క్తిని గుద్దుతాడు. ఇక ఆ త‌ర్వాత ఓ తాగుబోతు, టిక్‌టాక్ ఇప్ల్పుయెన్స‌ర్స్‌, ఓ యువ‌తి హీరోతో పాటు ప్ర‌యాణం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అంతేకాకుండా వీరివెంట ఓ వైపు పోలీసులు, డిటెక్టివ్‌, హీరోను చంపేందుకు ఓ వ్య‌క్తి వెంట ప‌డుతుంటారు. అఖ‌రుకు అ తాగుబోతు ఎవ‌రు, ఆ టిక్‌టాక‌ర్స్‌తో హీరోకు ఉన్న లింక్‌, మ‌ధ్య‌లో వ‌చ్చిన యువ‌తి ఎవ‌రు, హీరోను చంప‌డానికి మ‌నిషిని ఎవ‌రు పంపారు, డిటెక్టివ్ ఎందుకు ఎంట‌ర్ అవాల్సి వ‌చ్చింది, ఇలా క‌థ ర‌క‌ర‌కాల ట్విస్టులు తీసుకుంటూ చివ‌రి వ‌ర‌కు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

సినిమా ప్రారంభంలో మ‌న‌కు ఏం అర్థం కాక‌పోయినా అర గంట త‌ర్వాత హీరోకు వ‌చ్చే క్యారెక్ట‌ర్ల‌తో లింకులు బ‌య‌ట ప‌డుతూ భ‌లే ఆస‌క్తిగా సాగుతుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా చూస్తున్నంత సేపు భ‌లే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడీ సినిమా జీయో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అఈవుతుండ‌డ‌గా హిందీతో పాటు తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. మంచి వెరైటీ, డిఫ‌రెంట్ మూవీ చూడాల‌నుకునే వారు ఎట్టి ప‌రిస్థితుల్లో మిస్ అవ‌కండి