తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు(Tirumala laddu ghee adulteration case)లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసు ఏ3 నిందితుడు విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు అంగీకరించారు.
నెయ్యిని కంపెనీలు కల్తీ చేశాయని, ఇందుకు అనుకూలంగా తాను వ్యవహరించానని, ఈ మేరకు లంచం తీసుకున్నానని డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి(Dairy expert Vijayabhaskar Reddy) ఒప్పుకున్నారు. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్‌ను చేసింది.



































