ఆ తర్వాత కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో, క్రాకర్స్ షో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 8 వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే…విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన 5 భారీ స్క్రీన్ల దగ్గర వేలాదిమంది డ్రోన్ ప్రదర్శనను చూశారు. డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. డ్రోన్ షోకి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 400కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు రకాల థీమ్‌లతో డ్రోన్ హ్యాకథాన్ సాగింది.
ఆకాశపు కాన్వాస్‌పై డ్రోన్లు గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో అదరహో అనే రేంజ్‌లో జరిగింది. కృష్ణా తీరంలో…పున్నమి ఘాట్‌లో…పున్నమి వెలుగులను మించి డ్రోన్ హ్యాకథాన్ జరిగింది. ఒకటి కాదు రెండు కాదు..ఒకేసారి 5,500 డ్రోన్లు వెలుగులు విరజిమ్మూతూ ఆకాశంలోకి దూసుకెళ్లి పలు థీమ్‌లను ఆవిష్కరించాయి. దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షోకి విజయవాడ వేదికగా మారింది. ఆకాశంలో చుక్కలు కుప్పబోసినట్లు…నక్షత్రాల్లా మిలమిలా మెరిసిపోయాయి డ్రోన్లు. డ్రోన్ల తళుకుబెళుకుల ముందు నక్షత్రాలు చిన్నబోయాయి. ఇక ఈ డ్రోన్ షో ద్వారా అమరావతిలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. డ్రోన్ షో, లేజర్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన పత్రాలు అందించారు.
– లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ క్రియేషన్
– లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్
– డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండాప్రదర్శన
– అతిపెద్ద ఏరియల్ లోగోతో మొత్తం ఐదు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి
ఈ డ్రోన్ షో ను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 లో భాగంగా ఈ సాయంత్రం పున్నమి ఘాట్ లో డ్రోన్ షో, లేజర్ షో, ఫైర్ వర్క్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులు వీటిని ప్రారంభించారు. విజయవాడ నగరం నుంచి సందర్శకులు భారీగా రావడంతో కృష్ణానదీ తీరం జనసంద్రంగా మారింది. విజయవాడ నగరవాసులు డ్రోన్ షో వీక్షించేలా అధికారులు ఐదు ప్రాంతాల్లో డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతో పాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇటీవల నిర్వహించిన డ్రోన్ హ్యాకథాన్లో విజేతలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. మొత్తానికి డ్రోన్ షో కు ఐదు గిన్నిస్ రికార్డులు రావడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
ఆకాశంలో రకరకాల ఫార్మేషన్లతో డ్రోన్లు అందరిని ఆకట్టుకున్నాయి. అవి పలు రకాల థీమ్‌లను ప్రదర్శించాయి. డ్రోన్ల కాంతులు…వినీలాకాశంలో రకరకాల ఆకారాలకు ప్రాణం పోశాయి. 1911 ఇండియా కమ్మెమోరేటివ్ పోస్టేజ్ స్టాంప్ ఆకారంలో ఫార్మ్ అయిన డ్రోన్లను చూసి, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆకాశం అనే కాన్వాస్ మీద…చెయ్యి తిరిగిన చిత్రకారుడు కుంచె పెట్టి గీసినట్లు…డ్రోన్లు గీసిన చిత్రాలను చూసి చిత్తరువులా మారిపోయారు జనం.
ఆకాశంలో నిమిషానికో రూపం సంతరించుకున్న డ్రోన్ చిత్రాలను చూసి వీక్షకులు మంత్రముగ్ధులైపోయారు. విమానం రూపం సంతరించుకున్న డ్రోన్ షో అందరిని తన్మయత్వంలో ముంచెత్తింది. 1961లో మొట్టమొదటిసారి పంపిన ఎయిర్‌మెల్‌ని పురస్కరించుకుని ఈ విమాన రూపాన్ని ప్రదర్శించారు. ఇక అమరావతి థీమ్‌కు చిహ్నంగా…డ్రోన్లు గీసిన బుద్ధుడి చిత్రాన్ని చూసి అచ్చెరువొందారు వీక్షకులు. ఇక విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, యూఏవీలకు చిహ్నంగా థీమ్స్‌ను ప్రదర్శించాయి డ్రోన్లు. ఆ తర్వాత జయహో మ్యూజిక్ వస్తుండగా జాతీయ జెండాను ప్రదర్శించాయి డ్రోన్లు.
ఆ తర్వాత కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో, క్రాకర్స్ షో జరిగాయి. ఈ కార్యక్రమాన్ని 8 వేల మంది ప్రత్యక్షంగా వీక్షిస్తే…విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన 5 భారీ స్క్రీన్ల దగ్గర వేలాదిమంది డ్రోన్ ప్రదర్శనను చూశారు. డ్రోన్ల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. డ్రోన్ షోకి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 400కి పైగా కంపెనీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. పలు రకాల థీమ్‌లతో డ్రోన్ హ్యాకథాన్ సాగింది.
ఈ డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దక్కాయి. డ్రోన్లు ఆకాశంలో ఆవిష్కరించిన లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి, నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, అతి పెద్ద ఏరియల్ లోగో ఆకృతి, అతి పెద్ద జాతీయ జెండా ఆకృతి, అతి పెద్ద విమానాకృతి…వీటికి ఈ పురస్కారాలు దక్కాయి.