ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒక్కొక్క సెలబ్రెటీ వరుస శుభవార్తలు చెబుతున్నారు. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంట తల్లిదండ్రులు అవ్వగా..
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసన దంపతులు తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా తెలిపారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా – ఎంపీ రాఘవ్ చద్దాలు పండండి బాబుకు జన్మనిచ్చారు. మరికొంతమంది సెలబ్రెటీలు కూడా త్వరలో గుడ్‌న్యూస్ చెప్పడానికి సిద్ధమయ్యారు. తాజాగా తెలుగు బుల్లితెర నటుడు సాయికిరణ్ గుడ్‌న్యూస్ చెప్పారు.
హీరోగా సక్సెస్ కాలేకపోయిన సాయికిరణ్
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు సాయికిరణ్. అలనాటి సింగర్ రామకృష్ణ కుమారుడైన ఆయన తొలుత హీరో అవ్వాలని కలలు కన్నారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మాతగా తెరకెక్కించిన నువ్వేకావాలిలో సెకండ్ హీరో పాత్రలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచినప్పటికీ సాయికిరణ్‌కు అవకాశాలు క్యూకట్టలేదు. దీంతో చిన్నాచితకా సినిమాలు, గెస్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ సినిమాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు సాయికిరణ్.
సీరియల్స్‌తో పాపులర్
ఈ క్రమంలో బుల్లితెరపై అదృష్టం పరీక్షించుకోవాలని అనుకున్నారు. తొలుత ఈటీవీలో ప్రసారమైన శివలీలలు సీరియల్‌లో విష్ణుమూర్తిగా నటించారు. ఈ సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో తెలుగు, తమిళ, మలయాళం సీరియల్స్‌లో ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అభిలాష, ఇంటిగుట్టు, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యా రాగం, భానుమతి తదితర సీరియల్స్ ఆయనకు బాగా పేరు తీసుకొచ్చాయి. ఇటీవలి కాలంలో గుప్పెడంత మనసులో మహేంద్రగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇందులో హీరో పాత్ర రిషికి తండ్రిగా, జగతి మేడంకు భర్తగా సాయికిరణ్‌కు స్టార్‌డమ్ వచ్చింది.
భార్యకు విడాకుకులు, స్రవంతితో పెళ్లి
తొలుత సాయికిరణ్‌కు వైష్ణవితో వివాహం జరిగింది. వీరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగగా.. ఆ తర్వాత మనస్పర్థలు చోటు చేసుకోవడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే జీవించిన సాయికిరణ్.. కోయిలమ్మ సీరియల్‌లో తన సహ నటి స్రవంతితో ప్రేమలో పడి ఆమెను గతేడాది డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే మీ గర్భం దాల్చగా డెలివరీ కోసం ఇద్దరూ వెయిట్ చేస్తున్నారు. స్రవంతి గర్బవతి అయినప్పటి నుంచి సాయికిరణ్ ఆమెను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా సాయికిరణ్‌కు స్రవంతి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
సాయికిరణ్‌కు స్రవంతి సర్‌ప్రైజ్
స్రవంతి తన భర్త కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె షేర్ చేశారు. నా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌కు వచ్చింది. నా భర్తకు కంగ్రాట్స్ అని స్రవంతి రాసుకొచ్చారు. అంతకుముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూంలో స్రవంతి – సాయికిరణ్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. భార్య ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో సాయికిరణ్ షాకయ్యాడు. సూపర్ మెటియర్ 650.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఎమోషన్, ఈ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ స్రవంతి అంటూ ఆమె పోస్ట్‌కు రిప్లయ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
































