హైదరాబాద్ వాసులకు తీవ్ర హెచ్చరిక.. అలా చేస్తే 10వేల జరిమానా!

హైదరాబాద్ వాసులకు తీవ్ర హెచ్చరికను జారీ చేస్తుంది జలమండలి. నీటి వృధాను అరికట్టడం కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న జలమండలి ప్రజలు ఆ విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరిస్తుంది.


నీరు జీవనాన్ని ఇస్తుందని, అటువంటి నీటిని వృధా చేస్తే జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇస్తుంది.

ఒక కోటి 30 లక్షల మందికి తాగు నీటిని సరఫరా చేస్తున్న జలమండలి

జలమండలి హైదరాబాద్లో ఒక కోటి 30 లక్షల మందికి తాగు నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణ, గోదావరి, సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి రోజుకు 550 ఎం జి డి ల నీటిని తరలించి శుద్ధిచేసి ప్రజలకు జలమండలి అందిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి పైప్లైన్ల ద్వారా నీటిని తెచ్చి శుద్ధి చేసి హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని తీరుస్తోంది.

మంచినీరు వృధా చేస్తున్న నగర వాసులు

గోదావరి జలాలకు ఎల్లంపల్లి నుంచి 160 కిలోమీటర్లు, కృష్ణా జలాలకు నాగార్జునసాగర్ నుంచి 150కిలోమీటర్ల పైపులైన్లు వేసి నీటిని నగరవాసులకు చేరుస్తుంది. ఈ భారీ సరఫరా వ్యవస్థ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. పంపింగ్, శుద్ధి, పంపిణీకి అయ్యే వ్యయం కారణంగా ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుతో నీటిని అందిస్తుంటే అటువంటి రక్షిత మంచినీటిని చాలామంది వృధా చేస్తున్నారు.

వారికి జలమండలి వార్నింగ్

వాటర్ ట్యాంక్ లు నిండిన తర్వాత నీళ్లను బయటకు వదిలివేయడం, అనవసరమైన వాటికి నాకు నీటిని వినియోగించడం చేస్తున్నారు. సంపులు నిండిన తర్వాత రోడ్లపైకి నీటిని వదిలివేసి, నీరు దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని వదిలిపెట్టమని జలమండలి వార్నింగ్ ఇస్తుంది. నీటి దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం జరిమానా విధించే చట్టం అమలులో ఉందని పేర్కొంది జలమండలి.

గతేడాది జరిమానాలు విధించామని చెప్పిన జలమండలి

గత సంవత్సరం ఏడుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి పది వేలు చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొంది. నీటి వృధాను అరికట్టడం కోసం ఈ సంవత్సరం నీరు దుర్వినియోగం చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు జలమండలి ఒక ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చింది. ఇక జరిమానాలు మాత్రమే కాదు వృధా తీరును బట్టి. వృధా తీవ్రతను బట్టి కనెక్షన్ ను తొలగించే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తోంది.

చర్యలు పక్కా.. హెచ్చరిక

కొత్త సంవత్సరం తాగునీటిని అవసరాలకు మాత్రమే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా భావిస్తోంది. ఈ క్రమంలోనే జలమండలి ఎండి కే అశోక్ రెడ్డి పక్కా ప్రణాళికతో తాగునీరు వృధా కాకుండా చర్యలకు దిగనున్నట్లు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.