రోజూ బెల్లం తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్ను తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలు తొలగిపోతాయి. రాత్రిపూట బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. బెల్లం పాలతో కలిపి తాగితే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి.
బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం నివారించడానికి రాత్రి పడుకునే ముందు బెల్లం తినడం ప్రారంభించండి. బెల్లం అనేది సహజమైన డిటాక్సిఫయర్. ఇది లివర్ నుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిని రాత్రి తినడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది. బెల్లంలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు నోటి లోపల బాక్టీరియా పెరగకుండా నివారిస్తాయి. ఇది దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటుంది.
బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇది చక్కెర కంటే చాలా ఆరోగ్యకరమైనది. భోజనం తరువాత ఏదైనా తీపిగా తినాలనిపించినప్పుడు బెల్లం అత్యుత్తమ ఎంపిక అవుతుంది. బెల్లం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. చర్మ సౌందర్యానికి కూడా బెల్లం చాలా మంచిది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.
మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం మంచిది కాదు. రోజు కేవలం 5 నుంచి 10 గ్రాముల బెల్లం మాత్రమే తినాలి. భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
































