కరోనా తర్వాత గుండె సంబంధిత సమమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె వ్యాధులను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు.
అయితే శరీరం మనల్ని ముందుగానే ఇందుకు సంబంధించి అలర్ట్ చేస్తుంది. వీటి ఆధారంగా జాగ్రత్తపడితే సమస్య నుంచి బయటపడొచ్చు. గుండెపోటు వచ్చే ముందు వారం రోజుల ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు ఛాతీలో నొప్పి వస్తుంది. అయితే సాధారణంగా అసిడిటీ వంటి సమస్యలు తలెత్తిన సమయంలో కూడా ఛాతి నొప్పి కూడా సవ్తుంది. అయితే గుండె పోటు సమయంలో వచ్చే ఛాతి నొప్పి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా ఎడమ వైపు ఎక్కువ నొప్పి ఉంటుంది.
* గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో భుజం, చేతుల్లో నొప్పులు కూడా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఉన్నపలంగా ఎడమ భుజంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు.
* కొన్ని సందర్భాల్లో అరచేతితో పాటు చేతుల్లోనూ విపరీతమైన నొప్పి వేధిస్తుంది. భరిలంచలేని నొప్పి వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి. సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.
* గుండెపోటుకు, వెన్నునొప్పికి మధ్య సంబంధం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎలాంటి శ్రమ లేకున్నా వెన్నునొప్పి ఉన్నపలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలను చేయించుకోవాలి.
* గుండెపోటు వచ్చే ముందు దవడల్లో నొప్పి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎడమవైపు దవడలో సడెన్‌గా నొప్పి వస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి. సంబంధిత పరీక్షలను చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.