ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 70 లక్షలు.. ఎలాగంటే.?

మనం మన కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం గురించి చర్చించినప్పుడు, అనుకోకుండానే సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రస్తావన వస్తుంది. రాజన్ తన స్నేహితులు లేదా సలహాదారులతో మాట్లాడినప్పుడు, అతని 10 ఏళ్ల కుమార్తె రియా కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే విషయంపైనే చర్చ జరిగింది.


ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అదనంగా, సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే.

సుకన్య యోజనలో, కుమార్తె కోసం 10 సంవత్సరాల వరకు ఖాతాను తెరవవచ్చు. రాజన్ కుమార్తెకు కూడా పదేళ్లు. అతడు ఈ ఖాతాను తెరవగలడు. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇక అతడి కూతురికి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూర్ అవుతుంది.ఈ సుకన్య సమృద్ది యోజన పథకం కింద, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన భాగాన్ని చదువుకు, ఇతరత్రా ఖర్చులకు పొదుపు చేయవచ్చు. రాజన్ సుకన్య ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రియా ప్రస్తుతం 10 ఏళ్ల వయస్సు ఉన్నందున, ఆమెకు 18 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి అవుతుంది.

ప్రస్తుత 8.2 శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే 8 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం 16.95 లక్షల రూపాయలు కావచ్చు. రాజన్ అప్పుడు ఉండే ఈ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేయగలడు. ఆ మొత్తాన్ని ఆమె ఉన్నత విద్య ఫీజులకు కవర్ చేయొచ్చు. ఒకవేళ అలాకాకుండా అమ్మాయికి మొదటి నుంచి 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ సుకన్య స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే.. 2045 నాటికి కార్పస్ సుమారు 70 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ పధకం ఆడపిల్లల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది.