రూ.1 ప్లాన్ అందించే బెనిఫిట్స్ ఏంటి?
ఈ రూ.1 ప్లాన్ (Rs.1 prepaid plan) కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారికి లేదా వేరే నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికింద వినియోగదారులకు భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ సిమ్ కార్డ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి కాకుండా, యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఫస్ట్‌టైమ్ యూజర్లకు, తక్కువ ధరలో సెకండరీ సిమ్ కోసం చూస్తున్న వారికి లేదా కంపెనీ నెట్వర్క్ సేవలు ట్రై చేయాలనుకునే కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది.
తక్కువ ధరకు బేసిక్ కనెక్టివిటీని కోరుకునే వినియోగదారుల కోసం రూ. 1 ప్లాన్ తీసుకొచ్చారు. బ్యాకప్ నంబర్ అవసరమయ్యే వ్యక్తులు, విద్యార్థులు లేదా BSNL నెట్వర్క్ కవరేజ్ బలంగా ఉన్న ప్రాంతాల్లోని కస్టమర్లకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు.
రూ.1 ప్లాన్ ఆన్లైన్లో అందుబాటులో లేదు. BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా ఆథరైజ్డ్ BSNL రిటైలర్స్ దగ్గర సిమ్ తీసుకోవాలి లేదా పోర్ట్ చేయించుకోవాలి. సిమ్ కార్డ్ కోసం అవసరమైన KYC ప్రాసెస్ పూర్తి చేయాలి. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత, రూ.1 ప్లాన్ బెనిఫిట్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతాయి. వినియోగదారులు వాయిస్, డేటా, SMS సేవలను వాడుకోవచ్చు.
BSNL మరో కొత్త ప్లాన్ భారత్ కనెక్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని ధర రూ.2,626. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్ యూజర్లకు రోజుకు 2.6GB డేటా అందిస్తుంది. అదనంగా ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ జనవరి 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 24 వరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు BSNL రీఛార్జ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్, కంపెనీ అధికారిక చాట్‌బాట్ BReX ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించడంతో పాటు, BSNL తన సూపర్‌స్టార్ ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై ధర తగ్గింపును కూడా అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్ ఇప్పుడు రూ.999 నుంచి రూ.799కి తగ్గింది. ఈ ప్లాన్ మంత్లీ 200Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందిస్తుంది. 12 నెలలకు ముందే చెల్లిస్తే కస్టమర్లకు BSNL 20 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌ను మార్చి 31 వరకు కొత్త ధర, డిస్కౌంట్ ఆఫర్‌తో పొందవచ్చు.


































