రాష్ట్ర వ్యాప్తంగా 0-6 సంవత్సరాల చిన్నారుల ఆధార్ నమోదు కోసం ప్రభుత్వం స్పెషల్ ఆధార్ సెంటర్లు నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 20 వరకు, మరలా 26 నుంచి 28వ తేదీ వరకు అంగన్‌వాడీ సెంటర్లలో ఆధార్ నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ నమోదు కాని చిన్నారులు 11,65,264 మంది ఉండగా, ఇటీవల నిర్వహించిన ఆధార్ క్యాంపుల్లో 64,441 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 11,00,823 మంది చిన్నారుల ఆధార్ నమోదు చేయాల్సి ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీలైనంత ఎక్కువ మంది చిన్నారుల ఆధార్, బయోమెట్రిక్ నమోదు చేయాలని జిఎస్‌డబ్య్లుఎస్, డిఎల్‌డిఒలు తప్పనిసరిగా మానిటరింగ్ చేసి లక్ష్యాలను అధిగమించాలని జిఎస్‌డబ్ల్యుఎస్‌శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ పేర్కొన్నారు.