ఐఆర్‌సీటీసీ తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి.. లింక్ చేయడం ఎలా?

ఇక నుంచి మీరు ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ ఆధార్‌ను లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం..

బుకింగ్‌లో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఐఆర్‌సీటీసీ ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. మీరు ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నా, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో ఆఫ్‌లైన్‌లో లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నా, తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది.


చాలా మంది ఏజెంట్లు బల్క్ బుకింగ్‌ల ద్వారా తత్కాల్ కోటాను దుర్వినియోగం చేస్తున్నారు. దీనికి బ్రేక్ వేయడానికి ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు తత్కాల్ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది అన్ని బుకింగ్ మోడ్‌లకు వర్తిస్తుంది.

ఇక నుంచి ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి చేసింది. ఈ ధృవీకరణ కోసం మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు విడిగా వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) పంపిస్తారు. తత్కాల్ బుకింగ్ సమయంలో సజావుగా ఉండేలా చూసుకోవడానికి, చివరి నిమిషంలో ఇబ్బందులను నివారించడానికి, మీ ఆధార్ ప్రామాణీకరణను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. తత్కాల్ బుకింగ్ సమయంలో మీ ఆధార్‌ను ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఎలా లింక్ చేయాలో చూద్దాం..

స్టెప్ 1: అధికారిక IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ రిజిస్టర్డ్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.

స్టెప్ 2: తరువాత ప్రొఫైల్ విభాగానికి నావిగేట్ చేసి, డ్రాప్‌డౌన్ జాబితా నుండి లింక్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి.

స్టెప్ 3: మీ ఆధార్ కార్డులో కనిపించే విధంగా మీ పూర్తి పేరును నమోదు చేయండి. తరువాత మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 4: చెక్‌బాక్స్‌ను టిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు మీరు వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను అందుకుంటారు.

స్టెప్ 5: తర్వాత ఓటీపీని నమోదు చేసి.. వెరిఫై ఓటీపీపై క్లిక్ చేసి, ఆపై ప్రక్రియను పూర్తి చేయడానికి అప్‌డేట్ బటన్‌ను నొక్కండి. లింక్ విజయవంతం అయిన తర్వాత కన్ఫామ్ పాప్-అప్ కనిపిస్తుంది.

ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేయడం సరైన చర్య. చాలా మంది ఏజెంట్లు బల్క్ బుకింగ్‌ల ద్వారా తత్కాల్ కోటాను దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కొత్త ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ ఈ సమస్యను నివారించే అవకాశం ఉంది. ఇది ప్రయాణీకులకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.