పోస్టాఫీస్ పథకాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్- ఆధార్‌, పాన్‌కార్డు అప్డేట్ త‌ప్పనిస‌రి

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌తో పాటు నేష‌న‌ల్ సేవింగ్స్ స్కీం (ఎన్ఎస్‌పీ), ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌) వంటి ప‌థ‌కాలకు కూడా కొత్త రూల్స్ అక్టోబ‌ర్ 1 నుంచి రాబోతున్నాయి. పోస్టాఫీస‌ుల్లో నేష‌న‌ల్ సేవింగ్స్ స్కీం (ఎన్ఎస్‌పీ), ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్‌) వంటి ప‌థ‌కాల్లో పొదుపు చేస్తున్న ఖాతాల‌ను క్రమ‌బ‌ద్దీక‌రించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిద్ధప‌డింది. చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌కు సంబంధించి కొత్త రూల్స్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ తీసుకొచ్చింది. ఈ మూడు ప‌థ‌కాల‌కు సంబంధించిన మొత్తం ఆరు కొత్త రూల్స్‌ను అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌లు చేసేందుకు సిద్ధం అయింది. అందుకోసం కొత్త మార్గద‌ర్శకాల‌ను విడుద‌ల చేసింది.

పోస్టాఫీసులు ఖాతాదారుల నుంచి పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివ‌రాల‌ను తీసుకోవాల‌ని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఈ వివ‌రాలు ఇచ్చిన వారు ఏమీ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇంకా ఇవ్వని వారు పోస్టాఫీసుకు వెళ్లి ఈ వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త నిబంధ‌న‌ల ప్రకారం, ఖాతాను కొన‌సాగించాలంటే పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఖాతా ఓపెన్ చేసే స‌మ‌యంలో జ‌రిగిన పొర‌పాట్లను స‌వ‌రించి, స‌రిదిద్ధడానికి ఈ రూల్స్ రూపొందించిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 1990 ఏప్రిల్ 2కి ముందు తెరిచిన ఎన్ఎస్ఎస్-87 ఖాతాలు ప్రస్తుత స్కీం రేటులో వ‌డ్డీని పొందుతుంది. మ‌రోవైపు రెండో ఖాతా ప్రస్తుత పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా (పీఓఎస్ఏ) రేటుతో పాటు బ్యాలెన్స్‌పై 2 శాతం పొందుతుంది. అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త నియ‌మం ప్రకారం రెండు ఖాతాల‌కు 0 శాతం వ‌డ్డీ ల‌భిస్తోంది. ఎన్ఎస్ఎస్‌-87 ఖాతాలు 1990 ఏప్రిల్ 2 త‌రువాత ఓపెన్ చేసిన ఖాతాల్లో మొదటి ఖాతా ప్రస్తుత స్కీమ్ రేటులో వ‌డ్డీని పొందుతుంది. రెండో ఖాతా ప్రస్తుత పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా (పీఓఎస్ఏ) రేటులో వ‌డ్డీని పొందుతుంది. ఈ రెండు ఖాతాల‌కు అక్టోబ‌ర్ 1 నుంచి 0 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.

కొత్త నిబంధ‌న‌ల ప్రకారం, మైన‌ర్‌కు 18 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా (పీఓఎస్ఏ) వ‌డ్డీ రేటు వర్తిస్తుంది. మెచ్యూరిటీ.. మైనర్ 18వ పుట్టిన రోజు నుంచి లెక్కిస్తారు. ఒకే వ్యక్తి పేరు మీద అనేక పీపీఎఫ్ అకౌంట్స్ ఉంటే, ఒకే సంవ‌త్సరంలో పెట్టే పెట్టుబ‌డి మొత్తం ప‌రిమితిలోపు ఉంటే, మొద‌టి ఖాతాకు వ‌చ్చే వ‌డ్డీ రేటు అన్ని ఖాతాల‌కు వ‌స్తుంది. ప‌రిమితి దాటితే, ఎక్స్‌ట్రా మ‌నీని మొద‌టి ఖాతాలో క‌లుపుతారు. ఎక్స్‌ట్రా మ‌నీకి వ‌డ్డీ రాదు.

డిపాజిట్లు వార్షిక ప‌రిమితిలోపు ఉంటే, ప్రాథ‌మిక ఖాతా ప‌థ‌కం రేటుపై వ‌డ్డీని పొందుతుంది. ఏడైనా అద‌న‌పు ఖాతాల నుంచి బ్యాలెన్స్ ప్రాథ‌మిక ఖాతాలో విలీనం చేస్తారు. ఏదైనా అద‌న‌పు మొత్తాలు వ‌డ్డీ లేకుండా తిరిగి ఇస్తారు. రెండు కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ప్రారంభ తేదీ నుంచి ఇప్పటి వ‌ర‌కు వ‌డ్డీ ఉండ‌దు.

సుక‌న్య స‌మృద్ధి ఖాతాలు తెలిచిన సంర‌క్షుల విష‌యంలో కొత్త నిబంధ‌న ప్రకారం చ‌ట్టబ‌ద్దమైన సంర‌క్షకులు కానివారు అంటే, ఉదాహ‌ర‌ణ‌కు తాత‌లు, అమ్మమ్మ, నాన్నమ్మ తెరిచిన ఖాతాలు త‌ప్పనిస‌రిగా చ‌ట్టప‌ర‌మైన సంర‌క్షకులు లేదా, స‌హ‌జ త‌ల్లిదండ్రుల‌కు సంర‌క్షక‌త్వాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. స్కీమ్ మార్గద‌ర్శకాల‌ను ఉల్లంఘించిన రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెలిచిన‌ట్లు అయితే అద‌న‌పు ఖాతాలు ర‌ద్దు చేస్తారు.

ఎన్ఆర్ఐల పీపీఎఫ్ అకౌంట్స్ నిబంధ‌న‌లు మారనున్నాయి. 2024 సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు విదేశాల్లో ఉంటూ, పీపీఎఫ్ ఖాతాల‌కు సంబంధించిన కొన్ని నియ‌మాల‌ను పాటించ‌న‌వ‌స‌రం లేని ఎన్ఆర్ఐలు తమ ఖాతాల‌పై పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా (పీఓఎస్ఏ) రేటు ప్రకారం వ‌డ్డీని అందుకుంటారు. అయితే 2024 అక్టోబ‌ర్ 1 నుంచి ఈ ఖాతాల‌పై ఎలాంటి వ‌డ్డీ ఇవ్వరు. ఈ తేదీ నుంచి ఖాతాలో ఉన్న డ‌బ్బు మీద వ‌డ్డీ రాదు.