గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు సిద్ధం అయింది ఏపీ ప్రభుత్వం. దానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈమేరకు ఆగస్ట్ 12న రాష్ట్ర సచివాలయంలో అధికారులతోపాటూ పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించారు.
గతం టిడిపి హయంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించేవారు. కానీ గతకొద్ది రోజులుగా ఇది మరుగున పడిందిక. తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో కృష్ణమ్మహారతిని నెల రోజుల్లోగా పున:ప్రారంభించాలని నిర్ణయించారు. కావున కృష్ణమ్మ హారతి నిర్వహహణకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. రహదార్లు, విద్యుత్, బస్సు రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జలవనరులు, సిఆర్డీఏ, దేవాదాయశాఖ, దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, పోలీస్, ట్రాన్సుకో,మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలన్ని మంత్రి ఆదేశించారు.
రానున్న రోజుల్లో పవిత్ర సంఘం వద్ద కేవలం కృష్ణమ్మ హరతికే పరిమితం కాకుండా ఆప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక , పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రుల కమిటీ తొలిసమావేశం నిర్వహించింది. త్వరితగతిన కృష్ణమ్మ హారతిని పున:ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రస్తుతం కొనసాగుతుంది. దానిని మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు అధికారులు.