ఏపీలో చెత్త పన్ను రద్దు.. చంద్రబాబు కీలక ప్రకటన

www.mannamweb.com


జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా అడుగులు వేయాలని.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు.. వారి వల్లే అందరం ఆరోగ్యంగా ఉంటున్నామన్నారు. గత

వైఎస్సార్‌సీపీది చెత్త ప్రభుత్వం.. చెత్తమీద పన్ను వేశారు కానీ వ్యర్థాలను తొలగించలేదన్నారు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వ నిర్వాకంతో 85లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. దీన్ని ఏడాదిలో తొలగించాలని పురపాలకశాఖ మంత్రి నారాయణను ఆదేశించామని.. ఏపీలో చెత్త పన్ను వసూలుచేయొద్దని అధికారులను ఆదేశిస్తున్నానన్నారు. వచ్చే కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా పర్యటించారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో గాంధీ విగ్రహానికి పూలదండ వేసి కళాశాల బయట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛసేవలో పాల్గొన్నారు. అనంతరం తితిదే కల్యాణమండపం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.