AC Temperature: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!

www.mannamweb.com


మీ ఇంట్లో ఏసీ ఉందా? అయితే, మీరు ఓ షాకింగ్ విషయం తెలుసుకోవాలి. వేసవి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏసీ ఉపయోగిస్తారు. మరీ కూల్‌గా కాకపోయినా ఉష్ణోగ్రతలను 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల మధ్య ఉంచుతారు.

ఈ ఉష్ణోగ్రతల మధ్య ఏసీని ఉంచడం మంచిదే. తగిన చల్లదనంతోపాటు విద్యుత్ కూడా అదా అవుతుంది. ఈ ఉష్ణోగ్రతల్లో ఏసీని ఉంచితే ముక్కు పట్టేయడం, జలుబు వంటి సమస్యలు కూడా రావు. కానీ, ఓ చిక్కు మాత్రం ఉంది. అదే డెంగ్యూ. అదేంటీ? ఏసీకి, డెంగ్యూకు లింకేంటి అనేగా మీ సందేహం? అయితే మీరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR-NIMR) జరిపిన పరిశోధనలో ఏం తెలిందో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

నిపుణుల సమాచారం ప్రకారం.. 24 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతల్లోనే దోమలు ఎక్కువగా బతుకుతాయి. ఈ ఉష్ణోగ్రతల్లోనే ఏడెస్ దోమలు వృద్ధి చెందుతాయి. ఫలితంగా ఏసీ ఉండే గది డెంగ్యూ దోమలకు అడ్డాగా మారుతుంది. డెంగ్యూ, చికున్‌గున్యా వంటి రోగాలు చలికాలంలో మాత్రమే కాదు, ఎండకాలంలో కూడా ఉనికిని చాటుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఏసీలు ఉపయోగించేవారు 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో ఏసీని సెట్ చేసుకోవడమే బెటర్ అని అంటున్నారు.

సాధారణ దోమలకు, డెంగ్యూ దోమలకు తేడా ఇదే: వివిధ రకాల వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులతో సంబంధం ఉన్న దోమలు సాధారణ ఉష్ణోగ్రతల్లో సంతానోత్పత్తి చేస్తాయి. డెంగ్యూకు కారణమయ్యే దోమలు మాత్రం కంటైనర్ల(మూసివున్న ప్రాంతాలు లేదా గదులు, ఇళ్లు)లో సంతానోత్పత్తి చేస్తాయి. కంటైనర్ యొక్క ఉష్ణోగ్రత 24-28 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉన్నట్లయితే, డెంగ్యూ వ్యాపించే ఏడిస్ దోమలు వృద్ధి చెందుతాయి.

కానీ, విద్యుత్ ఆదాకు 24 డిగ్రీలే సరైనది: వేసవిలో వేడి మాత్రమే కాదు.. కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్‌లోనే ఉంచాలి. ఏసీల్లో ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ చొప్పున పెంచితే 6 శాతం విద్యుత్తును ఆదా చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు. జపాన్ వంటి దేశాల్లోని ఏసీల్లో కేవలం 28 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉంటాయి. కానీ, ఇండియాలో మాత్రం 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఉష్ణోగ్రత తగ్గే కొద్ది విద్యుత్ వినియోగం పెరుగుతుంది. మీరు నివసించే ప్రాంతంలో దోమల బెడద లేనట్లయితే.. ఈ ఫార్ములా ఫాలో అవ్వొచ్చు. దోమలు ఎక్కువగా ఉంటే మాత్రం.. ఏసీని 24 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో పెట్టుకుని సురక్షితంగా ఉండండి.

Source: Dr Ramesh C Dhiman, Senior consultant at DST- ICMR center of excellence for climate change and vector-borne diseases at the Indian council of medical research (ICMR-NIMR), Delhi.