ఏసీబీ స్కెచ్.. అడ్డంగా దొరికిపోయిన ఎంఈవో జాన్

అవినీతి అధికారులపై ఏసీబీ (ACB) ఆఫీసర్లు ఉక్కుపాదం మోపుతున్నారు. లంచం(Bribe) అనే మాట వినిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. వల పన్నీ అధికారులను పట్టుకుంటున్నారు.


ఇప్పటికే పలువురు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

అవినీతి గుట్టురట్టు

తాజాగా ఓ అవినీతి అధికారి గుట్టురట్టు చేసింది. రూ.40 వేల లంచం బాగోతాన్ని బద్దలు కొట్టింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Seetharamaraju District)లో జరిగింది. పాడేరు(Paderu)కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి.. తన బెనిఫిట్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంఈవో ఆఫీసుకు వెళ్లారు. తన పని చేసి పెట్టాలని ఎంఈవోను కోరారు. అయితే రూ. 40 వేలు ఇవ్వాలని ఎంఈవో జాన్ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను రిటైర్డ్ ఉద్యోగి సంప్రదించారు. పక్కా పథకం పన్ని ఎంఈవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. దీంతో ఎంఈవో జాన్ అడ్డంగా బుక్కయ్యారు. శాఖా పరమైన చర్యలకు అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.