Acidity: అసిడిటీ, గ్యాస్‌, ఛాతిలో నొప్పి.. అన్నింటికీ ఈ ఒక్క డ్రింక్‌తో చెక్‌.

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అసిడిటీతో బాధపడుతున్నారు. ఛాతిలో విపరీతమైన నొప్పి, అజీర్తి ఇలాంటి అసిడిటీ వస్తే చుక్కలు కనిపిస్తాయి.


అయితే ఈ సమస్యకు నేచురల్‌ విధానంలో చెక్‌ పెట్టొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

కడుపులో ఎక్కువ మొత్తంలో గ్యాస్, యాసిడ్‌ ఉత్పత్తి కావడం వల్ల అసిడిటీ సమస్య వస్తుంది. దీంతో కడుపులో మంట, పుల్లటి తేన్పులు, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. దీంతో చాలా మంది చాతిలో విపరీతమైన నొప్పి వేధిస్తుంటుంది. సాధారణంగా సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువ మసాలాలు, కారం తినడం వంటివి అసిడిటీ కారణమవుతాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం, గబాగబా ఆహారాన్ని తీసుకోవడం కూడా అసిడిటీకి దారి తీస్తుంది.

ఇక మానసిక ఒత్తిడి కూడా అసిడిటీకి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. దీంతో అసిడిటీ సమస్య వస్తుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకునే వారిలోనూ అసిడిటీ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది అసిడిటీ అనగానే రకరకాల మందులు ఉపయోగిస్తుంటారు. కానీ సహజ విధానాల్లో కూడా అసిడిటీకి చెక్‌ పెట్టొచ్చు. అలాంటి ఓ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

పెరుగు

జిలకర్ర

మిరియాలు

ఉప్పు

ఇసబ్బగోల్‌ పౌడర్‌

తయారీ విధానం:

అసిడిటీ తగ్గించే ఈ నేచురల్‌ డ్రింక్‌ తయారీ చాలా సులభం. ఇందుకోసం ముందుగా ఒక టీ స్పూన్‌ జిలకర్ర, మిరియాలను పొడిగా చేసుకోవాలి. అనంతరం ఒక కప్పు గడ్డ పెరుగుతను తీసుకోవాలి. తర్వాత ఆ పెరుగులో కొన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత అంతకు ముందు దంచిపెట్టుకున్న పొడిని వేసుకొని కవ్వంతో బాగా చిలకాలి.

మజ్జిగ తయారైన తర్వాత రుచి కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక చివరిగా రెండు స్పూన్‌ల ఇసబ్బాల్‌ పౌడర్‌ వేసుకొని కలుపుకోవాలి. అంతే అసిడిటీని తరిమికొట్టే డ్రింక్ రడీ అయినట్లే. ఈ మజ్జిగను ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం తీసుకుంటే వారం రోజుల్లో అసిడిటీ బలాదూర్‌ అవ్వడం కాయం. ఇసబ్బగోల్ పౌడర్‌ సూపర్ మార్కెట్‌తో పాటు అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాగా ఈ ఇసబ్బగోల్‌ పౌడర్‌ జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ అసిడిటీ, గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలన్నీంటినీ దూరం చేస్తుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.