జవహర్ నవోదయలో అడ్మిషన్స్.. ఫ్రీ ఎడ్యుకేషన్.. ఇలా అప్లై చేసుకోండి

www.mannamweb.com


మీ పిల్లల చదువు భారం కాకూడదనుకుంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేసే పాఠశాలల్లో చేర్పించొచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ పాఠశాలలు, ఆర్మీ స్కూల్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు, ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు. రూపాయి ఖర్చు లేకుండా చదివించి మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించొచ్చు. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వార్యంలో పనిచేసే నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులు ఎవరంటే?

ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన జవహర్ నవోదయలో అడ్మిషన్ పొందే అవకాశం వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ/ప్రభుత్వం చేత గుర్తించబడిన పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. 2025-26 అకడమిక్ సెషన్ కోసం 6వ తరగతిలో ప్రవేశానికి నవోదయ ఎంపిక పరీక్ష జనవరి 18, ఏప్రిల్ 12వ తేదీలలో రెండు దశల్లో నిర్వహించబడుతుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం:

నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: navodaya.gov.in.
హోమ్‌పేజీలో JNVST 2025-26 క్లాస్ 6 అడ్మిషన్ కోసం లింక్‌ని క్లిక్ చేయండి.
ఆ తర్వాత “రిజిస్ట్రేషన్”పై క్లిక్ చేయాలి.
సరైన వివరాలతో దరఖాస్తు ఫామ్‌ సమర్పించిన తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి.
చివరగా దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.