కల్తీ నెయ్యికి ప్రధాన కారకుడు జగనే

www.mannamweb.com


వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని నారాయణ తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని.. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్‌కు వెళ్లిందన్నారు.

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Former CM YS Jagan) కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని.. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్‌కు వెళ్లిందన్నారు. తిరుమల పవిత్రతను మంట కలిపింది జగన్‌మోహన్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డి వల్లే…

ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయన్నారు. కర్ణాటక నెయ్యి టెండర్‌ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశారని ప్రశ్నించారు. లడ్డూ గురించి ఇష్టానుసారం మాట్లాడడం ఇకనైనా మానుకోవాలన్నారు. సుప్రీంకోర్టు సమోటోగా లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

అమిత్ షా క్రిమినల్….

కేంద్రమంత్రి అమిత్ షా వామపక్ష శత్రువులను లేకుండా చేస్తున్నారని.. అమిత్ షా క్రిమినల్ అంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సైద్థాంతిక వ్యవస్థను నాశనం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కత్తితో రాజకీయం చేస్తే కత్తితోనే పోతారని హెచ్చరించారు. లోపాల్ని ఎత్తి చూపేవారిని చంపేయడం సరైంది కాదన్నారు. మోడీకి వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిందన్నారు. నైతికంగా మోడీ ఓడిపోయారన్నారు. మోదీని కొనసాగించకూడదని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బీజేపీ హయాంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. మోదీ విదేశాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నిస్తూ.. భారతదేశానికి మోడీ ఛీప్ గెస్ట్ ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న తమిళనాడు గవర్నర్‌‌ను రీకాల్ చేయాలన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ముందుగా పరిష్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు.