తక్కువ ధరకే మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే రైట్ టైమ్! ఇండియాలో మోస్ట్ అఫార్డిబుల్ ఈవీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలపై సంస్థ డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇండియాలో మోస్ట్ అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది టాటా టియాగో ఈవీ. ఇప్పుడు పండగ సీజన్ నేపథ్యంలో, ఈ ఈవీపై టాటా సంస్థ భారీ డిస్కౌంట్ని ప్రకటించింది. కస్టమర్లు ఈ ఈవీపై రూ. 75వేల వరకు బెనిఫిట్స్‌ని పొందొచ్చు. అంతేకాదు టాటా పవర్ స్టేషన్స్‌లో 6 నెలల ఉచిత ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా టియాగో ఈవీ బ్యాటరీ ప్యాక్..
టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో లభిస్తుంది. ఇందులో 19.2 కిలోవాట్ల యూనిట్, 24 కిలోవాట్ల యూనిట్ ఉన్నాయి. రెండు యూనిట్లు లిక్విడ్-కూల్డ్, మల్టీ-మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టెమ్ని కలిగి ఉన్నాయి. 0 నో రెజిన్‌తో పాటు 3 మ్యాక్స్ రెజిన్ కలుపుకుని మొత్తం నాలుగు లెవల్స్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవి రేంజ్ ఎంత?
టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్లు 221 కిలోమీటర్ల పరిధిని ఇస్తున్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లు 275 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నాయి.
టాటా టియాగో ఈవీ కలర ఆప్షన్స్?
టియాగో ఈవీ ఐదు రంగుల్లో లభిస్తుంది. సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టీన్ వైట్, మిడ్నైట్ ప్లమ్ ఉన్నాయి.
టాటా టియాగో ఈవీపై వారంటీ ఎంత?
టియాగో ఈవీలో బ్యాటరీ ప్యాక్, మోటార్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు. వాహనంపై 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ ఉంటుంది.
టియాగో ఈవీ యాక్సిలరేషన్ టైమ్ ఎంత?
మీడియం రేంజ్ కలిగిన టియాగో ఈవీ.. 6.2 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
టియాగో ఈవీ పవర్, టార్క్ గణాంకాలు ఏంటి?
ఈ ఎలక్ట్రిక్ కారు మీడియం రేంజ్ వేరియంట్లు 60బీహెచ్పీ పవర్, 110ఎన్ఎమ్ పవర్ అవుట్‌పుట్‌ని కలిగి ఉండగా, లాంగ్ రేంజ్ వేరియంట్లు 73బీహెచ్పీ పవర్, 114ఎన్ఎమ్ పవర్ అవుట్‌పుట్‌ను జనరేట్ చేస్తాయి.
టాటా టియాగో ఈవీపై బెనిఫిట్స్ ఎప్పటివరకు ఉంటాయి?
టాటా టియాగో ఈవీపై ఆఫర్స్, డిస్కౌంట్స్‌తో పాటు ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలను పొందడానికి, ఆసక్తి గల కస్టమర్లు సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రయోజనాలు అక్టోబర్ 31తో ముగుస్తాయని గమనించాలి.
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో మంచి పోటీ నెలకొంది. ఫలితంగా ధరలు కూడా దిగొస్తున్నాయి. ఎంజీ కామెట్ ఈవీకి టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తోంది. ఇక పండగ సీజన్ నేపథ్యంలో ఇప్పటికే చౌకైన ఈవీగా ఉన్న ఈ మోడల్.. మరింత తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం! ఫ్యామిలీలకు ఇది బాగా సూట్ అవుతుంది.