70 ఏళ్ల తర్వాత మౌని అమావాస్య .. ఈ రాశులకి మహా రాజయోగం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వలన ఒక్కోరాశికి ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి9న అమావాస్య. ఇది 70ఏళ్ల తర్వాత మౌని అమావాస్య వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.ఈరోజు నదుల్లో స్నానమాచరించడం చాలా మంచిదంట.

మౌని అమావాస్య రోజున రావి చెట్టుకు నీరు సమర్పించాలి. ఈ రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే పితృ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

Also Read ????ఏపీలో దారుణం..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపిన భార్య, ప్రియుడు!

Related News

మౌని అమావాస్య రోజున “ఓం ఆద్య భూతయ్ విద్మహే సర్వ సేవాయ ధీమాహి, శివ శక్తి స్వరూప్ పితృ దేవ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వంశపారపర్య దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. చీమలకు పిండిలో పంచదార కలిపి తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.

మౌని అమావాస్య రోజున పవిత్ర నదీ స్నానం చేసి సూర్య దేవుడికి నీరు సమర్పించాలి. రాగి చెంబులో నీరు, పువ్వులు, అక్షితలు, బెల్లం వేసి సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానాలకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

అంతే కాకుండా చాలా ఏళ్ల తర్వాత ఏర్పడే ఈ మౌని అమావాస్య వలన ఈ రాశుల వారకి చాలా అదృష్టం కలుగుతుందంట. అవి ఏ రాశులో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి :మేష రాశి వారికి మౌని అమావాస్య వలన పట్టిందల్లా బంగారమే కానున్నదంట. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.

వృషభరాశి : ఈ రాశి విద్యార్థులకు ఈ అమావస్య కలిసి వస్తుంది. వ్యాపారస్తు, ట్రేడ్ వర్గాల వారు మంచి లాభాలను పొందుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

మకర రాశి : ఈరోజు మకర రాశిలో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మకర రాశి వారికి అద్భుత ఫలితాలు అందబోతున్నాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు పెరుగుతాయి.
మీన రాశి : మీన రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతీ పనుల్లో విజయం వీరి సొంతం అవుతుంది.

Related News