భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట చిన్న బెల్లంముఖ్క తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి వ్యాధులు కూడా తగ్గుతాయని అంటున్నారు.
అంతేకాదు.. గ్లాస్ పాలలో బెల్లం వేసుకుని తాగితే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయని అంటున్నారు.
బెల్లంలో సహజ ఫైబర్, ఎంజైమ్‌లను సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. దీంతో గ్యాస్, గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. బెల్లం తినటం వల్ల గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది.
చిన్న బెల్లం ముక్క తినటం వల్ల శరీరం నుండి విష వ్యర్థాలను బయటకు పంపుతుంది. కాలేయం, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు మలబద్ధకం సమస్య ఉంటే గనక తిన్న తర్వాత ఖచ్చితంగా బెల్లం తినండి. దీనిలో ఉండే సహజ లక్షణాలు ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తాయి.
బెల్లం ఐరన్‌కు మంచి మూలం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు, రక్తహీనతతో బాధపడేవారు ఖచ్చితంగా బెల్లం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు..బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఖనిజాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.
చర్మ సౌందర్యానికి కూడా బెల్లం చాలా మంచిది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల మొటిమలు తొలగిపోతాయి. బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం నివారించడానికి రాత్రి పడుకునే ముందు బెల్లం తినడం ఈ రోజు నుండే ప్రారంభించండి.
































