గుంటూరు జిల్లా నుంచి మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షం అయ్యింది అఘోరీ.. ఇప్పుడు ఆ అఘోరి ఎక్కడ ఉంది..? ఏం చేస్తుందో తెలుసా.. ? స్మశాన వాటికలో ఒళ్ళు గగుర్పొడిచేలా అఘోరీ పూజలు చేస్తూ హల్ చల్ చేయడం సంచలనంగా మారింది..
అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్ క్రియెట్ చేస్తోంది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనానికి, అటు పోలీసులను చికాకు తెప్పిస్తున్నాయి.. గుంటూరు జిల్లా నుంచి మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షం అయ్యింది అఘోరీ.. వరంగల్ లోని ఓ స్మశాన వాటికలో ఒళ్ళు గగుర్పొడిచేలా అఘోరీ పూజలు చేసింది.. ఈమధ్య నిత్యం వార్తలో నిలుస్తున్న అఘోరి ప్రస్తుతం వరంగల్ నగర శివారులో సంచరించడం చర్చనీయాంశంగా మారింది.. ఈరోజు మధ్యాహ్నం వరంగల్ లోకి ప్రవేశించిన అగోరి మొదట పద్మాక్షి ఆలయం మీదుగా వరంగల్ శివారులోని బెస్తన్ చెరువు సమీపంలోని స్మశాన వాటికలోకి చేరుకుంది.
ఈ స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే శవపేటిక వద్ద పడుకొని కొంత సేపు హల్చల్ చేసింది.. శవాన్ని దాహనం చేసిన బూడిదంతా తన ఒంటిపై రుద్దుకొని హంగామా చేసింది.. అంతటితో ఆగలేదు.. చుట్టూ త్రిశూలాలు ఏర్పాటు చేసుకొని అచ్చం హర్రర్ మూవీని తలపించే తరహాలో పూజలు నిర్వహించింది. తన వెంట పూజ సామాగ్రి, కోడిని తెచ్చుకున్న అఘోరి అదే స్మశాన వాటికలో చుట్టూ త్రిశూలాలు పెట్టి ఆ త్రిశూరాల మధ్య కూర్చొని విచిత్ర పూజలు నిర్వహించింది.
కోడిని బలిచ్చి రక్తర్పనం చేసింది.. గుమ్మడికాయని కోసి ఆ గుమ్మడికాయ పై గంటకు పైగా విచిత్ర రూపంలో పూజలు నిర్వహించింది.. అఘోరి విచిత్ర పూజలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా హడలెత్తిపోయారు.
అఘోరిని చూడడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి బారులుతీరారు.. ఈ క్రమంలో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించేశారు..