బెస్ట్ AI ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏంటి? ఎంత జీతం సంపాదించవచ్చు? వంటి చాలా విషయాలను Nexford యూనివర్సిటీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఆ వివరాలు ఇవి.
మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్:
మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ పని ఏంటి అంటే? మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు మోడల్‌లను అభివృద్ధి చేయడం వీరి ప్రధాన పని. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, డేటా సైంటిస్టులతో కలిసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ సగటు జీతం సంవత్సరానికి రూ.92 లక్షల వరకు ఉంటుంది.
AI ఇంజనీర్ :
AI ఇంజనీర్లు AI వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. సరిగ్గా పని చేస్తుందా లేదో చెక్ చేస్తారు. AI ఇంజనీర్లు AI నమూనాలు, అల్గారిథమ్‌లను అభివృద్ధి చేస్తారు. ఇది కాకుండా, అతను AI వ్యవస్థను మెరుగుపరిచే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇందులో డేటాను క్లియర్, ప్రాసెస్ చేయడం ఉంటాయి. కొత్త AI సాంకేతికతలతో తాజాగా ఉండటం వంటివి ఉంటాయి. AI ఇంజనీర్ సగటు జీతం రూ.1 కోటి వరకు ఉంటుంది.
AI నిపుణుల జీతం:
ప్రస్తుతం భారతదేశంలో AI ఇంజనీర్లు రూ.6 లక్షల (LPA) నుంచి రూ.12 లక్షల (LPA) వరకు ఉంది.
రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు రూ.20 లక్షలు (LPA) ప్యాకేజీని పొందుతున్నారు. అనుభవం నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటే AI నిపుణులు రూ.35 లక్షల (LPA) నుంచి రూ.50 లక్షలు (LPA) ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంటే AI నిపుణులు వార్షిక ఆదాయాన్ని రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు.