రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో విద్యార్థులకు భోజన సదుపాయాల కల్పనను అక్షయపాత్రకు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్‌లు ఉండగా, వీటి పరిధిలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యా ర్థులు 25 వేల మందికిపైగా ఉన్నారు. యూనివర్సిటీ పరిధిలో తరచూ మెస్ నిర్వహణలపై విద్యార్థుల నుంచి ఆరోపణలు రావడంతో మెస్‌ల నిర్వహణ అక్షయ ాత్రకు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై విద్యా శాఖ మంత్రి లోకేశ్ పరిశీలిన్నారు. జూలై 1న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి మెస్ నిర్వహణ అక్షయపాత్రకు లేదా మరో సంస్థకు అప్పగించాలని ప్రతిపాదన పెట్టగా మంత్రి లోకేశ్ ఆ దిశగా యోచిస్తున్నట్టు సమాచారం.
ట్రిపుల్ ఐటీకి మెస్‌ల నిర్వహణ భారం
ఆర్జీయూకేటీ పరిధిలో ఇంజినీరింగ్ విద్యనభ్యసి స్తున్న 25 వేల మంది విద్యార్థులకు ప్రస్తుతం 12 మెస్‌లను ఏర్పాటుచేశారు. ఈ మెస్‌లు అక్షయ పాత్రకు ఇవ్వడం ద్వారా ఆర్జీయూకేటీపై అధికంగా భారం పడుతోంది. గత విద్యా సంవత్సరంలో మెస్‌ల నిర్వహణకు సంబంధించి ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.88 నిర్వాహకులకు చెల్లిస్తుండగా, పెరిగిన ధరల దృష్ట్యాభోజన వసతి కల్పనకు రూ.116.75 వరకు చెల్లించవచ్చని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫుడ్‌కమిటీ సిఫారసు చేసింది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ప్రభుత్వం అక్షయపాత్రకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.110 చెల్లించడం ద్వారా మెస్ నిర్వహణ అప్పగించేందుకు నిర్ణయించినట్టు తెలు స్తోంది. హిందూ ధార్మిక సంస్థ అయిన అక్షయపాత్ర మాంసాహారం అందించదు. శాఖాహార భోజనం ోనూ ఉల్లి, వెల్లుల్లి, అల్లంను వినియోగించదు. కాని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అందిస్తున్న మెనూలో శాఖాహారంతోపాటు రెండు రోజులు మాంసాహారం, ఐదు రోజులు కోడిగుడ్డును అందించాలి. ఈ నేపథ్యంలో పుడ్ కమిటీ నిర్ణయించిన రూ.116.75 లలో అక్షయ పాత్రకు ఇచ్చే రూ.110 పోను, మిగిలిన రూ.6.75 పైసలకు మరో రూ.5.50 పైసలు కలిపి రూ.12.75 పైసలను మాంసాహారం అందించే సంస్థ కు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోం ది. దీంతో ఆర్జీయూకేటీ ప్రస్తుతం ఇస్తున్న రూ.88లకు అదనంగా మరో రూ.33 చెల్లించాలి.
రూ.100లకే అందిస్తాం..
ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనాలను మాంసాహారంతో కలుపుకుని రూ.100 చెల్లిస్తే పూర్తి నాణ్యతతో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్జీయూకేటీ పరిధిలో ప్రస్తుతం భోజన సదుపాయాలు కల్పిస్తున్న 12 మంది మెస్ నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా సమాచారం అందించారు.
మొదలైన అభ్యంతరాలు
మెస్‌ల నిర్వహణ అక్షయపాత్రకు అప్పగించడంపై ప్రారంభ దశలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ ధార్మిక సంస్థ అయిన అక్షయపాత్ర శాఖాహార భోజనాన్ని అందిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం వినియోగించదు. జాతీయ పౌష్టికాహార సంస్థ నిర్ణయం ప్రకారం బాలికలకు వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సదరు ఆహార పదార్థాలను వినియోగించాలని తమ సిఫార్సుల్లో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అక్షయపాత్రకు భోజన కల్పనను అందించడం ద్వారా జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రతిపాదన లను ఎలా వ్యతిరేకిస్తారంటూ విద్యార్థినులు ప్రశ్నిస్తున్నా రు. ఆర్జీయూకేటీలో విద్యనభ్యసిస్తున్న 25 వేల మందిలో దాదాపు 65 శాతం మంది విద్యార్థి నులే. మరోవైపు భోజన సదు పాయాలను హిందూ ధార్మిక సంస్థకు అందించ డంపై ట్రిపుల్ ఐటీలోని ఇతర మతాలకు చెందిన విద్యార్థులు తమ అభ్యంతరాలను వ్యక్తపరు స్తున్నారు. టెండర్లను పిలవాల్సి వస్తే అక్షయపాత్రతో పాటు ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సంస్థలు సైతం మెస్‌ల నిర్వహణకు పోటీపడే అవకాశం కనిపిస్తోంది.
ఎకరం స్థలం ఇవ్వండి
ట్రిపుల్ ఐటీల్లో మెస్‌ల నిర్వహణను తమకు అప్పగించిన పక్షంలో మెస్‌ల్లో భోజన సదుపాయాలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న కిచెన్లు తమకు పనికి రావని, తమకు అనుగుణంగా కిచెన్‌లను తామే ఏర్పాటు చేసుకుంటామని, అందుకు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఎకరం భూమిని తమకు ఇవ్వాలని అక్షయపాత్ర సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలా తమకు భూమి ఇస్తే ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.2 కోట్ల వరకు తమకు ఇచ్చేందుకు ఆయా క్యాంపస్‌ల పరిధిలోని ఎంపీలు సిద్ధంగా ఉన్నారని, మిగిలిన మొత్తం తమ సంస్థ బరాయించి, మెస్‌లకు అవసరమైన షెడ్లను, కావాల్సిన పరికరాలను ఏర్పాటు చేసుకుంటామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు సమాచారం.
మెప్మాకు మాంసాహారం బాధ్యత
ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు మెప్మా ద్వారా మాంసాహారం భోజనం అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఫుడ్ కోర్ట్‌ను మెప్మా పరిధిలో నిర్వహిస్తుండగా, ఇదేవిధంగా నాలుగు క్యాంపస్‌లలోనూ మాంసాహార భోజనాన్ని మెప్మా ద్వారా అందించేందుకు ముందుకు వస్తున్నట్టు అధికార పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు.
































