ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం కొమొరిన్ ఏరియా అంటే దక్షిణ భారతదేశంపై అల్పపీడనం ఉంది. ఇది భూమి నుంచి 5.8కిలోమీటర్ల వరకు మేఘాలను కలిగి ఉంది.
దీనికి సరైన గాలులు తోడైతే తుపాన్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం గాలులు దిశ ఒకే విధంగా లేదు. అందువల్ల తుఫాన్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంది. అరేబియా సముంద్రంలో ఓ భారీ అల్పపీడనం ఉంది. ఇది భారత్ కు నైరుతీ దిశలో మాల్దీవులు, లక్షద్వీప్ దగ్గరలో ఉంది. దాని ప్రభావం తమిళనాడు, కర్నాటక, లక్షద్వీప్ తోపాటు మన ఏపీ, తెలంగాణపై కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో గురువారం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నా..మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు పడవు. కానీ భయంకరమైన సుడిగాలులు రాబోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సుడిగాలులు, మేఘాలను మోసుకొస్తాయి. ఇవి రోజంతా ఉంటాయి. మేఘాలు కూడా రోజంతా పరుగులు పెడుతుంటాయి. మేఘాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. గురువారం బంగాళాఖాతంలో గాలివేగం గంటకు 19కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 17కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 15కిలోమీటర్లుగా ఉంది. ఈ గాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ తెలిపింది.
































