AP TET 2024 : టెట్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటితో (ఆగస్టు 3) ఏపీ టెట్ దరఖాస్తుల గడువు ముగియనుంది. కావున, ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు త్వరపడాల్సిందే.
టెట్‌కు అప్లయ్ చేయాలనుకునేవారు టెట్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి
https://aptet.apcfss.in/#
వెబ్ సైట్ లోకి అప్లికేషన్ పూర్తిచేయగలరు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహణ తప్పనిసరని టెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగానే జులై 2వ తేదిన ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ రోజు నుంచే టెట్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసేందుకు చివరితేది ఆగస్టు 3.2024 అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. కావున, అభ్యర్థులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగలరు.
ఏపీ టెట్ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుంది. అర్హత, అసక్తి కలిగిన అభ్యర్థులు రేపటిలోపు ఫీజు చెల్లింపుతో పాటు అప్లికేషన్‌ను కూడా పూర్తి చేసుకోవచ్చు. టెట్ దరఖాస్తు గడువు పెంచే ఆలోచన లేదని ఇప్పటికే ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఏపీ టెట్ 2024 పరీక్షలు అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఏపీ టెట్ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అభ్యర్థుల కోసం అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వీటిని ఫ్రీగా రాసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి అభ్యర్థులకు టెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబరు 3వ తేదీన ప్రారంభమైన పరీక్షలు అక్టోబర్ 20వ తేదీతో ముగుస్తాయి. ఏపీ టెట్ 2024 ఫైనల్ ఫలితాలు నవంబరు 2వ తేదీన విడుదలవుతాయి.
ముఖ్యమైన తేదీలివే..
ఏపీ టెట్ నోటిఫికేషన్ – జులై 2, 2024
టెట్ పరీక్ష ఫీజు చెల్లింపు, అప్లికేషన్లు చివరి తేదీ -ఆగస్టు 3, 2024
టెట్ ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు – సెప్టెంబర్ 19, 2024
టెట్ హాల్ టికెట్లు – సెప్టెంబర్ 22, 2024
టెట్ పరీక్షలు ప్రారంభం తేది – అక్టోబర్ 3, 2024
టెట్ పరీక్షలు ముగిసే తేది – అక్టోబరు 20, 2024
టెట్ ఫైనల్ కీ విడుదల – అక్టోబర్ 27, 2024
టెట్ ఫలితాలు విడుదల – నవంబర్ 2, 2024