పెట్టుబడిదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకపోతే నష్టపోతారు.

www.mannamweb.com


సంపదను పెంచుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ పెట్టుబడి మార్గాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో మ్యూచువల్ ఫండ్స్ ముందుంటాయి.

వీటిలో కొంచెం రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో రాబడిని అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనే మాట ఇటీవల కాలంలో చాలా బాగా వినిపిస్తోంది. గతంలో పట్టణ ప్రజలే వీటిపై ఆసక్తి చూపేవారు. ఇప్పడు గ్రామీణులు కూడా వీటిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే వాటిలో పెట్టుబడులు పెట్టేముందు కొన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ కింది తెలిపిన విషయాలను పూర్తిగా అర్థం చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ పై స్పష్టత వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ అంటే..

ముందుగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. స్టాక్ లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కలిగిన వారి నుంచి సేకరించిన డబ్బు అని అర్థం. పెట్టుబడి దారుడు తన ఇన్వెస్ట్ మెంట్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కలిగి ఉంటాడు.

పెట్టుబడి లక్ష్యాలు..

మీ పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా అవసరం. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పాటు పదవీ విరమణ, విద్య, సంపద నిర్మాణం కోసం పెట్టుబడి పెడుతున్నారా అనే విషయంపై అవగాహన పెంచుకోవాలి. దాని ఆధారంగానే మీకు సరిపడే మ్యూచువల్ ఫండ్‌లను ఎంపిక చేస్తారు.

డైరెక్ట్ , రెగ్యులర్ ప్లాన్లు..

డైరెక్ట్ ప్లాన్ లో మీరు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలో పెట్టుబడి పెడతారు. మధ్యవర్తి లేనందున తక్కువ ఖర్చులు, అధిక రాబడికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటర్, బ్రోకర్ ద్వారా పెట్టుబడి పెడతారు. లావాదేవీల కోసం వారికి కొంత కమీషన్ చెల్లించాలి. దీని వల్ల రాబడి కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

కేవైసీ..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారందరూ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర గుర్తింపు రుజువులు అవసరం.

పెట్టుబడి మార్గాలు..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు ప్రాథమిక మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏఎంసీ వెబ్ సైట్లు. అంటే నేరుగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) వెబ్‌సైట్ల నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతితో జెరోదా కాయిన్ (Zerodha Coin), గ్రో (Groww), ఏంజెల్ వన్ (Angel One), పేటీఎమ్ మనీ (Paytm Money) తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించవచ్చు. ఇవి బహుళ ఫండ్‌లను ట్రాక్ చేయడంతో పాటు పెట్టుబడి పెట్టడాన్ని సులభం చేస్తాయి.

ఫండ్స్ ఎంపిక..

మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక చేసుకోవడం చాాలా కీలకం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లు దీర్ఘకాలిక వృద్ధికి బాగుంటాయి. అయితే కొంచెం రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. ఐదేళ్లకు మించిన లక్ష్యాలకు తగినవి.
డెట్ మ్యూచువల్ ఫండ్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుంది. స్వల్పకాలిక లక్ష్యాలు, తక్కువ అస్థిర ఆదాయ ఉత్పత్తికి అనుకూలం.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ, డెట్ మిశ్రమం. వీటి ద్వారా రిస్క్, రిటర్న్‌లను బ్యాలెన్స్ చేయవచ్చు.
ఇండెక్స్ ఫండ్‌లు/ఈటీఎఫ్‌లు: ఇవి నిర్దిష్ట ఇండెక్స్ (నిఫ్టీ 50 వంటివి) పనితీరును అనుకరిస్తాయి.

ఎస్ఐపీ, లంప్ సమ్..

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లో నెలవారీ నిర్ణీత మొత్తాన్నిపెట్టుబడి పెట్టవచ్చు. జీతం పొందే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది.
లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.