భారత దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. దేశంలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాం చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. పిల్లలకు, పెద్దలకు రైలు ప్రయాణం థ్రిల్లింగ్ గా ఉంటుంది. బస్సులు.. ఇతర ప్రైవేట్ వాహనాల్లో లేని సౌకర్యాలు ట్రైన్స్ లో ఉంటాయి. సుదూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువ రైలు ప్రయాణాలు చేయడానికే మక్కువ చూపిస్తుంటారు.భారత్ రైల్వే.. ప్రపంచంలోనే అది పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా నిలిచింది.ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు లక్షల సంఖ్యల్లో ప్రయాణిస్తుంటారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అలర్ట్ ఇచ్చంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల తో పాటు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు బిగ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ మధ్య రేల్వే. పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కారణం నిర్మాణ, నిర్వహణ పనులు అని తెలిపింది. సికింద్రా బాద్ – పూణె మధ్య తిరిగే శతాబ్ది సహా గోల్కొండ, శాత వాహన ఎక్స్ ప్రెస్ లతో పాటు మరికొన్ని రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక నెల రోజుల పాటు ఆయా ట్రైన్లను రద్దు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజనల్ లోని మూడో ట్రైన్ కి సంబంధించిన లైను పనులు చేస్తున్న కారణంగా రైలు సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. ఇక రద్దైన ట్రైన్ల లీస్టు అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి ముంబై మధ్య నడిచే దురంతో ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12220) 30న క్యాన్సిల్ చేశారు.
ముంబయి – సికింద్రబాద్ ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైన్ (12219) 31న రద్దు చేశారు.
సికింద్రబాద్ – పుణే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని (12206) జులై 29, 31 తేదీల్లో రద్దు చేశారు.
పుణే – సికింద్రబాద్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ (12205) జులై 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో రద్దు చేశారు.
గుంటూరు – సికింద్రాబద్ (17201), సికింద్రాబాద్ – గుంటూరు (17202) గోల్కొడ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ఆగస్టు 5 నుంచి 10 వరకు రద్దు చేశారు.
డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756), విజయవాడ – భద్రాచలం రోడ్ (07979) భద్రాచంలో రోడ్ – విజయవాడ (07578) రైళ్లు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ – సాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18046) తో పాటు ఆదిలాబాద్- తిరుపతి మధ్య తిరిగే కృష్ణా ఎక్స్ ప్రెస్ , సికింద్రా బాద్ – తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింంద్రబాద్ – విశాఖ పట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్ – గూడురు మధ్య తిరిగే సింహపురి, లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించి నడిపించబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.