ఆ బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. వారం రోజుల్లో ఆ పని చేయకపోతే ఇక అంతే.

www.mannamweb.com


భారతదేశంలో బ్యాంకింగ్ రంగం వేగం వృద్ధి చెందుతుంది. పెరిగిన టెక్నాలజీకు అనుగుణంగా బ్యాంకుల్లో ఖాతా తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారింది. ఒక్కో వ్యక్తికు రెండు నుంచి మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయంటే వాటి డిమాండ్ ఎలా ఉందో?

మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అధికంగా ఖాతాలు ఉండడం వల్ల వాటి నిర్వహణ అనేది కష్టసాధ్యంగా మారిందని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే తాజాగా ప్రముఖ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఖాతాదారులకు పలు హెచ్చరికలను జారీ చేసింది. దాదాపు 325,000 పీఎన్‌బీ ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయలేదని, ఖాతాదారులు తమ కేవైసీ అప్‌డేట్‌లను పూర్తి చేయడానికి ఆగస్టు 12 వరకు సమయం ఉందని పీఎన్‌బీ అధికారులు వివరించారు. ఒకవేళ కేవైసీ అప్‌డేట్ చేయకపోతే ఖాతా కార్యకలాపాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పీఎన్‌బీ ఖాతాదారులు కేవైసీ ఎలా అప్‌డేట్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను అనుసరించి, అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులను వారి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31 నాటికి తమ ఖాతాలను అప్‌డేట్ చేసుకోని దాదాపు 3,25,000 ఖాతాదారులను పీఎన్‌బీ గుర్తించింది. ఈ కస్టమర్‌లు తమ కేవైసీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి బ్యాంక్ ఆగస్టు 12 వరకు గడువు విధించింది. గడువులోగా వారు ఈ-కేవైసీ వారు తమ ఖాతాలతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మార్చి 31లోపు తమ కేవైసీ అప్‌డేట్ చేసుకోని వారికి మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పీఎన్‌బీ స్పష్టం చేసింది. వారు తమ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేస్తే వారి ఖాతాలు సజావుగా పని చేస్తాయి. లేకపోతే ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని, డబ్బు విత్‌డ్రా చేయకుండా, రుణాలు తీసుకోకుండా లేదా ఇతర ప్రయోజనాల కోసం ఖాతాను ఉపయోగించే అవకాశం ఉండదని పీఎన్‌బీ నిపుణులు చెబుతున్నారు. అయితే ఖాతాలోకి డబ్బు జమ చేసుకోవచ్చని వివరిస్తున్నారు.

కేవైసీ అప్‌డేట్ ఇలా

కేవైసీను అప్‌డేట్ చేయడానికి కస్టమర్‌లు వారి సమీప పీఎన్‌బీ శాఖను వ్యక్తిగతంగా సందర్శించవచ్చని బ్యాంకు పేర్కొంది. వారి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఇటీవలి ఫోటో, పాన్ కార్డ్, ఆదాయ రుజువు వంటి అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలని సూచనలు చేసింది. ప్రత్యామ్నాయంగా కస్టమర్‌లు పీఎన్‌బీ వన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ద్వారా లేదా రిజిస్టర్డ్ ఇమెయిల్/పోస్ట్ ద్వారా అప్లికేషన్‌ను పంపడం ద్వారా వారి కేవైసీ అప్‌డేట్ చేసుకునే వెసులబాటు కల్పించింది.