జెరూసలేం: ప్రపంచంలోనే మొట్టమొదటి హై పవర్ లేజర్ ఇంటర్‌సెప్టర్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్ ప్రవేశపెట్టింది. ఐరన్ బీమ్ యొక్క తాజా వెర్షన్‌ను ఇజ్రాయెల్ మోహరించిందని సమాచారం.
ఈ వ్యవస్థ చాలా ప్రభావవంతంగా ఉందని మరియు యుద్ధంలో విజయవంతంగా పరీక్షించబడిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైనిక రక్షణ బలగాలకు కొత్త తరం ఆయుధం అందుబాటులోకి రావడంతో దేశం మరింత సురక్షితంగా ఉంటుందని నమ్ముతున్నారు.
రక్షణ కోసం ఇప్పటికే ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్స్ ఉన్నాయి. వీటిని మరింత బలోపేతం చేస్తోంది ఇజ్రాయెల్. ఆధునిక యుద్ధ పద్ధతులను శాశ్వతంగా మార్చగల సామర్థ్యం ఉన్న ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్‌ను ఈ వారం ప్రారంభంలో రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ విడుదల చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక లేజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగంలోకి వచ్చిందని ఇండియా టుడే నివేదించింది.
ఐరన్ బీమ్ త్వరలో విడుదల అవుతుందని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. హిజ్బుల్లాతో యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ఈ విషయాన్ని వెల్లడించింది.
అదనపు ఖర్చు లేకుండానే శత్రువులను తరిమికొట్టడం ఐరన్ బీమ్ యొక్క మరో ప్రత్యేకత. సాంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలకు $60,000 నుండి ఖర్చు అవుతుంది. అయితే, ఐరన్ బీమ్ లేజర్ టెక్నాలజీకి ఒక్కో షాట్‌కు కేవలం $2 మాత్రమే ఖర్చు అవుతుంది. దీనివల్ల యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు అయ్యే ఆర్థిక నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు.
శత్రువులు కనబడిన వెంటనే వారిని బూడిద చేయడానికి ఐరన్ బీమ్‌కు క్షణాల్లో సరిపోతుంది. శత్రువులను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు ప్రజల ప్రాణాలను కూడా రక్షించవచ్చని నఫ్తాలీ బెన్నెట్ తెలిపారు.
రాకెట్లు మరియు క్షిపణులను అడ్డుకోవడంలో ఇప్పటికే పేరు పొందిన ఇజ్రాయెల్ యొక్క వాయు రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌కు భిన్నంగా, ఐరన్ బీమ్ ‘సాటిలేని కచ్చితత్వంతో’ మోర్టార్‌లు, రాకెట్లు, డ్రోన్‌లను ధ్వంసం చేసే అత్యాధునిక లేజర్ వ్యవస్థ.
































