మునగ చెట్టు కేవలం ఓ సాధారణ కూరగాయల చెట్టే కాదు, ఇది ‘అద్భుత వృక్షం’గా గుర్తింపు పొందింది. మునగ ఆకులను ఎండబెట్టి తయారు చేసే మోరింగ పౌడర్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
దీన్ని నిత్యం కొద్ది మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు దీని ప్రయోజనాలపై ఓసారి చూద్దాం.
1. పోషకాల పవర్‌హౌస్:
మోరింగా పౌడర్‌లో విటమిన్ A, B1, B2, B3, B6, సీ, ఫోలేట్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. పాలకంటే 17 రెట్లు ఎక్కువ క్యాల్షియం, అరటితో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ పొటాషియం, క్యారెట్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ విటమిన్ A ఇందులో ఉండడం విశేషం.
2. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు
ఈ పౌడర్‌లో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, శరీరాన్ని క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం లాంటి వ్యాధుల నుంచి కాపాడుతాయి.
3. చక్కెర స్థాయిల నియంత్రణ
మధుమేహ సమస్య ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న ఐసోథియోసైనేట్లు రక్తంలో షుగర్‌ను సమర్థంగా నియంత్రించగలవు.
4. వాపుల నివారణ
ఇతర ఆరోగ్య సమస్యలకు మూలంగా నిలిచే శరీర వాపులను ఇది తగ్గించగలదు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది.
5. గుండెకు మేలు, కొలెస్ట్రాల్ తగ్గింపు
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మోరింగా పౌడర్ సహాయపడుతుంది.
6. కాలేయానికి రక్షణ
దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంపై ఆల్కహాల్ లేదా మందుల ప్రభావం తక్కువగా ఉంటుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
7. శక్తివృద్ధి, అలసట తగ్గింపు
ఐరన్ అధికంగా ఉండటంతో శక్తి స్థాయిని పెంచి, అలసటను దూరం చేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.
8. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు
మోరింగా పౌడర్ చర్మం మెరుస్తుంది, వృద్ధాప్య రేఖలను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలకూ ఇది బాగా సహాయపడుతుంది.
గమనిక: మోరింగ పౌడర్‌ను రోజూ ఒకటి రెండు టీ స్పూన్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అధిక మోతాదుల్లో తీసుకుంటే కొన్ని మందులకు ప్రభావం ఉండొచ్చు, కాబట్టి వైద్యుని సలహాతోనే వినియోగించాలి.
































