పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్… వివాదం ముదురుతోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతం గా ఉన్న ఇండస్ట్రీ ఇప్పుడు రోజుకో వివాదం చుట్టూ తిరుగుతుంది.


గడిచిన ఐదేళ్ళలో ఇండస్ట్రీ ఎన్ని ఇబ్బందులకు గురైందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం రాగానే ఇండస్ట్రీ కి పూర్తి స్థాయి స్వేచ్ఛ కలిగింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ కలిగి ఉన్నటువంటి టాలీవుడ్ టాప్ 4 నిర్మాతలు రీసెంట్ గా కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ఇక మీదట నడవాలి, రెంటల్ బేసిస్ మీద మాకు లాభాలు రావడం లేదు, ఇది జరగకపోతే సినిమా థియేటర్స్ ని జూన్ 1 నుండి మూసేస్తాము అంటూ పెద్ద ఎత్తున హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకెప్పుడైనా జరిగి ఉంటే బాగుండేది ఏమో కానీ, సరిగ్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సినిమా విడుదల సమయం లో జరగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది.

స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పై స్పందిస్తూ నిన్న ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి విడుదల చేయించిన ఒక లేఖ సంచలనం గా మారింది. ఇండస్ట్రీ కి ఇండస్ట్రీ లోని వారికి కూటమి ప్రభుత్వం తరుపున ఎంతో గౌరవ మర్యాదలు ఇవ్వాలని అనుకున్నాను, కానీ చివరికి నాకే వెన్నుపోటు పొడవాలని చూసారు, ఇండస్ట్రీ పెద్దలు నాకు ఇవ్వాలనుకున్న రిటర్న్ గిఫ్ట్ ని నేను స్వీకరిస్తున్నాను, ఆ రిటర్న్ గిఫ్ట్ కి బదులుగా నేను కూడా ఒక బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇక నుండి ప్రభుత్వం తో ఏ నిర్మాతకు కూడా వ్యక్తిగత చర్చలు ఉండవు, కేవలం సంబంధిత సంఘాలతోనే ప్రభుత్వం చర్చలు జరుగుతుంది. ఏ వ్యవహారం జరగాలన్నా సంఘాల ద్వారానే జరగాలి అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది.

పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా విడుదలయ్యే సమయంలోనే ఇండస్ట్రీ కి ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయి, అంతకు ముందు చాలా సైలెంట్ గా ఉండేవారు అంటూ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ వ్యవహారం నడిపించిన వారిలో నలుగురు నిర్మాతలు పేర్లు ప్రధానంగా సోషల్ మీడియా లో వినిపిస్తూ వచ్చాయి. వాళ్ళు ఎవరెవరంటే దిల్ రాజు(Dil Raju), అల్లు అరవింద్(Allu Aravind), సురేష్ బాబు మరియు ఏషియన్ సునీల్. సొంత కుటుంబ సభ్యుడైన అల్లు అరవింద్ సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయం లో ఈ కుట్రలో భాగస్వామ్యం పొందాడా?, ఇది అసలు ఊహించలేదు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలపై అల్లు అరవింద్ ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నాడు, ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఏమి మాట్లాడబోతున్నాడో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.