Allu Arjun: హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్, అట్లీ మూవీ

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు కొన్నాళ్లుగా టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకనట వెలువడలేదు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.


అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అధికారిక ప్రకటన ఏప్రిల్ 8 (నేడు) ప్రకటించారు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలతో తెరకెక్కనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగానిర్మించనున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు అట్లీ దుబాయ్‌లో స్టోరీ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారని, ఇంకో 10-15 రోజులు అక్కడే ఉండి ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. షూటింగ్ జూన్ 2025లో ప్రారంభమై, 2026 ఆగస్టులో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపించేలా రూపొందనుందని అంటున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని తాజాగా ఇచ్చిన అప్డేట్ చూస్తే అర్ధమవుతుంది.
హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి, అలాగే సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పనిచేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు తెరకెక్కని స్టైల్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తుంది.