తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే.

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉసిరి – కొబ్బరి నూనె:

ఉసిరి ఆరోగ్యానికే కాకుండా జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలు వేసి రాత్రంతా అలానే నానబెట్టి.. ఉదయం ఆ నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. ఓ గంట సేపు తర్వాత తల స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి పొడి కూడా కొబ్బరి నూనెలో కలిపి ఉపయోగించవచ్చు.

కరివేపాకు – కొబ్బరి నూనె:

జుట్టును ఆరోగ్యంగా ఉంచ, నల్లగా మార్చడంలో కరివేపాకు కూడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకులను డబుల్ బాయిలింగ్ పద్దతిలో మరిగించి చల్లరనివ్వాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి మర్దనా చేసి కాసేపు అలానే వదిలేయాలి.

ఉల్లిపాయ రసం:

తెల్లగా ఉండే జట్టును నల్లగా మార్చడంలో ఉసిరి రసం ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఉల్లి రసాన్ని తీసి జుట్టుకు కాసేపు పట్టించి ఓ 40 నిమిషాలు అలానే ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెహిందీ – కాఫీ మిశ్రమం:

మెహిందీ, కాఫీ పేస్ట్ కలిపి జుట్టుకు అప్లై చేస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు బాగా పట్టించి.. ఓ గంట సేపు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తల స్నానం చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)