హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ వచ్చేశాయి. ప్రతిఏటా ఈ నివేదిక విడుదల అవుతుంది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (IATA) నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తారు.
అయితే తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన ర్యాంక్స్ లో అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ఈ ర్యాంక్స్ లో అమెరికా 12 వ స్థానానికి పడిపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల లిస్టు నుంచి తొలిసారి అమెరికా కిందకు వెళ్లింది.
అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా విడుదలైన హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో అమెరికా కుప్పకూలింది. 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 12 వ స్థానానికి దిగజారింది. అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితా టాప్ 10 దేశాల నుంచి అమెరికా వైదొలగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. తాజా రిపోర్టు ప్రకారం అమెరికా పాస్ పోర్టు కలిగిన ప్రజలు కేవలం 180 దేశాల్లో మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అధికారం ఉంటుంది.
ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశం పాస్ పోర్టుతో 193 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక రెండో స్థానంలో దక్షిణ కొరియా.. అలాగే మూడో స్థానంలో జపాన్ ఉన్నాయి. ఇక భారత్ ఈ లిస్టులో 85వ స్థానంలో ఉంది. గతేడాది 80 వ స్థానంలో ఉంది. అలాగే 2021 లో 90 వ స్థానంలో భారత్ ఉంది. మన దేశానికి సంబంధించి బెస్ట్ ర్యాంక్ అంటే 2006 లో 71 వ ర్యాంకు సాధించింది.
అమెరికా ఈ లిస్టులో కుప్పకూలడానికి అనేక పాలసీలు, నిర్ణయాలు కారణంగా చెప్పవచ్చు. ఇటీవల బ్రెజిల్, చైనా, వియత్నాం దేశాలు వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చేర్చలేదు. అలాగే పపువా న్యూ గినియా, మయన్మార్, సోమాలియా దేశాలు న్యూ ఈ- వీసా వ్యవస్థను తీసుకొచ్చాయి. ఇవి కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో అమెరికాను చేర్చకపోవడం గమనార్హం.

































