తక్కువ ధరలో అదిరిపోయే సెవెన్ సీటర్ కార్

www.mannamweb.com


ఒక కుటుంబానికి సరిపడే కార్ కావాలంటే కచ్చితంగా సెవెన్ సీటర్ కార్ కావాలి. ఏడు మంది వ్యక్తులు కలిసి కంఫోర్ట్ గా కూర్చోవాలి.. అది కూడా తక్కువ ధరతో ఉన్న కారు కావాలి… అలంటి వారి కోసం ఓ మంచి కార్ అందుబాటులో ఉంది. మీరు అలాంటి కార్ కోసం చూస్తున్నట్లయితే.. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 7 సీట్లతోపాటు రూ. 6 లక్షల బడ్జెట్‌ ధరలో మీకు కార్ కావాలంటే రెనాల్ట్ కంపెనీ మీ కోసం ఓ సూపర్ కార్ ని అందిస్తుంది. ఇది తక్కువ బడ్జెట్ లో మంచి సౌకర్యవంతమైన కార్. ఇక ఈ కార్ ఫీచర్లు, ధర ఇంకా పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక ఈ కార్ పేరు రెనాల్ట్ ట్రైబర్. ఇదొక MPV మోడల్. ఇక ఈ కార్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ కెపాసిటీ గల 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 72 PS, 96 Nm అవుట్‌పుట్‌ను జనరేట్ చేయగలదు. ఈ కార్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ కార్లో ఇంకో మంచి అంశం ఏమిటంటే.. దీని మైలేజ్. ఈ కార్ లీటర్‌కు ఏకంగా 20 కిలోమీటర్ల రేంజిలో మైలేజీని ఇస్తుంది. అంతేగాక ట్రైబర్‌లో 84-లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది. దీని మూడో వరుస సీటును ఫోల్డ్ చేస్తే బూట్ స్పేస్ 625 లీటర్లకు పెరుగుతుంది. ఇది సరసమైన ధరలో దొరికే మంచి సెవెన్ సీటర్ కారు. అందుకే ఈ కార్ కొనాలనుకుంటే ఎలాంటి ఆలోచన చెయ్యాల్సిన పని లేదు. ఎందుకంటే దీని ధర కేవలం రూ. 5.99 లక్షల నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అయితే వేరియంట్ల ప్రాకారం ధర మారుతూ ఉంటుంది

రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో పని చేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్నాయి. ఇంకా పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, సెంటర్ కన్సోల్‌లో కూల్డ్ స్టోరేజ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉంటుంది. ఈ కారులో LED టర్న్ ఇండికేటర్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ మ్యూజిక్, ఫోన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ కారులో AC వెంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే EBDతో కూడిన ABS, బ్యాక్ పార్కింగ్ సెన్సార్, బ్యాక్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.