ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోకు మార్కెట్స్ మంచి ప్రజాతరణ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో అత్యంత శక్తివంతమైన మొబైల్స్ అందుబాటులోకి తీసుకు రావడంలో ఈ కంపెనీ ముందుంటుంది.. అందుకే చాలామంది ఇలాంటి మొబైల్స్ మనకు అనుకూలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటో కంపెనీ మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేస్తూ వస్తోంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో మోటో కంపెనీ తమ Moto G100 Pro స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాళ్లొకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్ప్లేతో విడుదల చేసింది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్‌ను అందిస్తుంది. అలాగే ఈ మొబైల్ స్క్రీన్ ఫీచర్స్‌లో భాగంగా ప్రత్యేకమైన డిసి డిమ్మింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.
ఈ Moto G100 మొబైల్ డిజైన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది వెనక భాగంలో ఎయిర్ నానో లెదర్ కూడా లభిస్తుంది. దీంతోపాటు దీనిని ముట్టుకోగానే ప్రీమియం టచ్ అనుభూతి కలిగించేందుకు.. కంపెనీ ఈ మొబైల్ స్క్రీన్‌కు ప్రత్యేకమైన ఫినిషింగ్ టచ్ అందించారు. ఈ మొబైల్ స్క్రీన్ స్ప్లాష్ ప్రొటెక్షన్ అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్ చేసేందుకు వీలుగా 12GB LPDDR4X RAMతో అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే స్పెషల్గా ఇందులో 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Moto G100 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. అంతేకాకుండా క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందుబాటులో ఉంచినట్లు సమాచారం. ఇక దీని వెనక భాగం వివరాల్లోకి వెళితే.. వెనక భాగంలో అత్యంత శక్తివంతమైన 50MP Sony LYT-600 ప్రధాన సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది.
అదనంగా 8MP అల్ట్రా-వైడ్ + మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ భాగంతో 32MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక దీనిని కంపెనీకి త్వరలోనే భారతదేశంలో కూడా విడుదల చేయబోతోంది. ఇది ఇప్పుడు చైనాలో అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ రూ.16,652 ధరతో ప్రారంభించింది.
































