ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే.. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్ ట్రేడుల్లో విశాఖపట్నం జిల్లా, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో అనకాపల్లి జిల్లా, డీజిల్ మెకానిక్ ట్రేడులో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, మెషినిస్ట్‌కు సంబంధించి విజయనగరం జిల్లా, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడుల్లో కాకినాడ జిల్లా, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్స్‌లో తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీలు ఉన్నాయి.
ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 6న, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు నవంబర్ 7న, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 08922-294906 నంబర్‌ను సంప్రదించవచ్చు.
సీటెట్ 2024 దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్.. ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 2024 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16వ తేదీవ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
కాగా సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తుంటారు. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం నిర్వహిస్తారు. ఇక రెండో పేపర్ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్కు లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు పరిగణనలోకి తీసుకుంటారు.