ఆదాయపు పన్ను శాఖ కొన్ని అవసరమైన మార్పులతో కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 3.0ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ పోర్టల్ ఉపయోగించడం చాలా సులభం కానుంది. దీని సహాయంతో ఆదాయపు పన్ను రిటర్నులను చాలా తక్కువ సమయంలో దాఖలు చేయవచ్చు.
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయబోతోంది. ఈ మేరకు అవసరమైన కొన్ని మార్పులతో కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ 3.0ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ పోర్టల్ ఉపయోగించడం చాలా సులభంగా ఉండనుంది. దీని సహాయంతో ఆదాయపు పన్ను రిటర్నులను చాలా తక్కువ సమయంలో దాఖలు చేయవచ్చు.
ప్రస్తుతం ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఈ-ఫైలింగ్, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్(ఐఈసీ) 2.0 వ్యవస్థను అనుసంధానం చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ సర్క్యులర్లో పేర్కొంది. ఐఈసీ 3.0ను కొత్త ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. హైస్పీడ్ ఐటీ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఐటీ శాఖ. ఐటీఆర్‌ల వెరిఫికేషన్, ప్రాసెసింగ్, జారీ ప్రక్రియను వేగవంతం చేయనుంది.
పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా కొత్త ఐటీఆర్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించే ముందు ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. అన్ని అభిప్రాయాలు, సూచనలను జాబితా చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాని ఆధారంగా పోర్టల్లో గణనీయమైన మార్పులు చేస్తారు.
ప్రస్తుత ఐఈసీ 2.0 విధానంలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పోర్టల్‌లో ట్రాఫిక్ పెరిగే కొద్దీ స్లో అవుతుంది. ఒక్కోసారి సైట్ క్రాష్ కూడా అవుతుంది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు గడువులోగా రిటర్నులు దాఖలు చేయడం లేదు.
ఈ ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులకు ఇ-ఫైలింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. దీని సహాయంతో ఆన్లైన్ ఆదాయపు పన్ను రిటర్నులను ఎక్కడి నుంచైనా దాఖలు చేయవచ్చు. పన్ను వ్యవహారాలకు సంబంధించిన ఇతర ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని ఇతర సేవలను వినియోగించుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. పన్ను చెల్లింపుదారులు తమ పాత ఐటీఆర్ ఫారాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.