శబరిమల భక్తులతో నిండిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవస్థానం బోర్డు నిర్ణయాలు తీసుకుంటోంది.
బుకింగ్ విధానంలోనూ కొత్త గా మార్పలు తెచ్చారు. శబరిమలలో భక్తులకు అందించే అన్న ప్రసాదానికి ప్రత్యేకత ఉంది. రోజూ మూడు పూటల అన్నదానం చేస్తారు. కాగా, అన్నప్రసాదం అందించే టైమింగ్స్.. మెనూ తో సహా అక్కడ అమలు చేసే విధానం సైతం అన్నీ ఆసక్తి కరంగా ఉంటాయి.
శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు కొండలు, కోనలు దాటి సన్నిధానానికి చేరుకునేసరికి అలసిపోవడం సహజం. అలాంటి వారి కోసం శబరిమల దేవస్థానం బోర్డు అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటి నుంచి శనివారం నాటికి లక్ష మందికి పైగా భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించారు. నెలవారీ పూజలతో సహా ఆలయం తెరిచి ఉన్న అన్ని రోజుల్లో అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ రోజుకు మూడు పూటలా ఆహారం అందిస్తారు. కాగా, ఉదయం (6:00 నుంచి 11:00 వరకు): ఉప్మా, కడల కర్రీ (శనగల కూర), వేడి వేడి కాఫీ అందిస్తారు. ఇక, మధ్యాహ్నం (12:00 నుంచి 3:30): పులావ్, దాల్ కర్రీ, పచ్చడి తో అన్న ప్రసాదం ఉంటుంది. కాగా.. రాత్రి (6:45 నుంచి ఆలయం మూసే వరకు): గంజి, పుజుక్కు భక్తులకు అందిస్తారు.
అయితే, భక్తుల రద్దీ ఎంత ఉన్నా, క్వాలిటీ, క్లీనింగ్ విషయంలో దేవస్థానం బోర్డు చర్యలు తీసుకో వడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వంట చేయడానికి, వడ్డించడానికి, క్లీనింగ్ కోసం మొత్తం 235 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. భక్తులు తిన్న ప్లేట్లు, గ్లాసులను మొదట శుభ్రం చేసి, ఆ తర్వాత డిష్ వాషర్ ద్వారా వేడి నీటితో మరోసారి క్లీనింగ్ చేస్తారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినే సామర్థ్యం ఉన్న హాల్ ను వినియోగిస్తున్నారు. అయితే, రద్దీ పెరిగే కొద్ది ఎక్కువ మందికి వసతి కల్పించడానికి ఏర్పాట్లు కూడా చేస్తారు. మకరవిళక్కు సీజన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా.. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోయం బత్తూర్ బేస్ క్యాంప్ నుంచి వచ్చిన 140 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బృందం సన్నిధానంలో మోహరించింది.
































