ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు దారుణమైన చేదు జ్షాపకాలు,మరికొందరికి మర్చిపోలేని విజయాలను మిగిల్చిన 2024ను దాటి 2025లోకి అడుగుపెట్టాం. అయితే కొత్త ఏడాదిలో ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో ఉంటుంది.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మనదేశంలో ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవాలని అందరూ ఆసక్తి కనబరుస్తున్న టైంలో అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది. కొత్త సంవత్సరం కొత్తల్లోనే కంగారును తెప్పించేలా ఉన్న ఈ వైరల్ న్యూస్ ఏంటో ఇక్కడ చూడండి.
కరోనా గురించి ముందు చెప్పింది ఇతనే
2020 ప్రారంభంలో ప్రపంచంలోని అన్ని దేశాల మీద దండయాత్ర చేసిన కరోనా పేరు మనం మర్చిపోలేం. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంత విలయతాండవం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయినట్లు అప్పట్లో అనేక పుకార్లు వినిపించాయి. సాక్షాత్తూ దేశాల అధ్యక్షులు కూడా ఇదే చెప్పారు. అయితే ఈ కరోనా వైరస్ తో ప్రపంచం తల్లడిల్లుతుందన్న అంచాన వేసిన తొలి వ్యక్తి నికోలస్ ఔజులా. 2018లోనే నికోలస్.. కరోనాలాంటి మహమ్మారి వస్తుందని,దాని కారణంగా లక్షల మంది చనిపోతారని అంచనా వేశాడు. నికోలస్ చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. ఇప్పుడు 2025 ఎలా ఉంటుందో చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు.
2025లో జరిగేది ఇదేనంట
2025లో మూడో ప్రపంచ యుద్దం ఖాయమని నికోలస్ తెలిపాడు. పాపం, హింస ఈ సంవత్సరం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని నికోలస్ చెప్పాడు. జాతీయవాదం పేరుతో హత్యలు జరుగుతాయని, రాజకీయ హత్యలు పెరుగుతాయని తెలిపాడు. సముద్ర మట్టాలు పెరుగుతాయని, అధిక వర్షపాతం,వినాశకరమైన వరదలు విరుచుకుపడతాయని నికోలస్ చెప్పాడు. వీటి కారణంగా కోట్ల మంది ప్రభావితం అవుతారని,నిరాశ్రయులు అవుతారని అంచనా వేశాడు. పలు నగరాలు కూడా మునుగుతాయని అంచనా వేశాడు. ఈ ఏడాదిలో బ్రిటన్ యువరాజు విలియం,హ్యారీల మధ్య విభేదాలు సమిసిపోయి వీరిద్దరూ కలిసిపోతారని నికోలస్ చెప్పారు.
ఎవరీ నికోలస్,అతడికి ఎలా తెలుసు
లండన్ కి చెందిన 38 ఏళ్ల నికోలస్ ఔజులా హిప్నో థెరపిస్టు. పదిహేడేళ్ల వయసులో అతడి కలలో ఎవరో కనిపించి భవిష్యత్తు గురించి చెప్పాడని చెబుతాడు. తాను ఈజిప్టు రాణిగా గత జన్మలో ఉన్నట్లు చెప్పిన నికోలస్ అంతకుముందు జన్మల్లో చైనాలో టైలర్ గా,హిమాలయాల్లో సన్యాసిగా కూడా జీవించినట్లు చెప్పారు. తాను ఆఫ్రికాలో పుట్టినప్పుడు తానో మంత్రగత్తె అని, ఒక జన్మలో సింహంగా కూడా బతికినట్లు చెప్పాడు. ఇప్పటివరకు ప్రపంచ పరిణామాలపై కూడా నికోలస్ చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. కరోనా వైరస్, ట్రంప్ విజయం,రోబో ఆర్మీ ఇలా అనేక అంచనాలని నికోలస్ అందరి కంటే ముందే చెప్పాడని చెబుతారు. తాజాగా అతడి నోటి నుంచి వచ్చిన 2025కి సంబంధించి అంచనాలు ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి.