Big shock to CM Jagan: జగన్‌కు మరో బిగ్ షాక్, ఈ వారంలో ఉత్తర్వులు..?

Big shock to CM Jagan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల మధ్య వివాదాస్పద మాటలు పక్కనబెడితే.. ఎన్నికల సంఘం అందరిపై ఓ కన్నేసి ఉంచుతోంది. తాజాగా సీఎం జగన్ మరో షాక్ తగలనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.


ముఖ్యంగా సీఎస్ జవహర్‌రెడ్డి మార్పుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సీఎస్ పదవి నుంచి ఆయన్ని తప్పించకుండా వేరే రాష్ట్రానికి ఎన్నికల అబ్జర్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం పంపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి నేతలు బలంగా చెబుతున్నారు. ఇదే జరిగితే జగన్ గెలుపు కష్టమనే అన్నవారు లేకపోలేదు. సీఎస్ జవహర్‌రెడ్డి స్థానంలో నలుగురు పేర్లు పంపించారట. వారిలో సీనియర్ ఐఏఎస్ రజత్ భార్గవ్, అనంతరాములు, ఆర్పీ సిసోడియా, నీరవ్ కుమార్ ప్రసాద్‌లు ఉన్నారు. దాదాపు నీరవ్‌కుమార్ పేరు ఖారైనట్లు తెలుస్తోంది.

సీఎస్ జవహర్‌రెడ్డిని తప్పించడానికి కారణాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా వ్యక్తి కావడం, రెండోది ప్రధాని నరేంద్రమోదీ చిలుకలూరిపేట సభ ఇష్యూ, మూడోది ఏపీలో పింఛన్ల వ్యవహారం.. ఇవన్నీ కలిసి ఆయన వేటుకు కారణమని చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ అధికారుల బదిలీలు, తప్పించడం సహజమేనని నేతలు చెబుతున్నమాట. గత టీడీపీ హయాంలోనూ సీఎస్‌ను మార్చిన సందర్భాలను ఇక్కడ గుర్తు చేస్తున్నారు పలువురు రాజకీయ నేతలు.
మరోవైపు ఏప్రిల్ మూడోవారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈలోగా డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను ఎన్నికల సంఘం మార్చే అవకాశముందని పలువురు ఐపీఎస్‌లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లపై వేటు వేసింది ఎన్నికల సంఘం. కొందరికి పోస్టింగులు ఇవ్వగా, మరికొందరిని పెండింగ్‌లో పెట్టింది. సిన్సియర్ ఐపీఎస్ అధికారి రఘురామ్‌రెడ్డిని అస్సాం ఎన్నికల అబ్జర్వర్‌గా ఈసీ పంపిన విషయం తెల్సిందే. మొత్తానికి సీఎం జగన్ అంతర్గత వ్యూహాన్ని టీడీనీ నేతలు బట్టబయలు చేస్తున్నారు.