మరో వివాదంలో చిక్కుకున్న మంచు విష్ణు సిబ్బంది

www.mannamweb.com


మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్‌పల్లి అడవిలో విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడారు. మేనేజర్ కిరణ్ అడవి పందులను వేటాడి తీసుకవెళ్లాడు.

ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లాడు. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అడవి పందులను వేటాడిన వారిపై అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మంచు కుటుంబంలో వివాదాలు తారాస్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే మరోకటి బయటకు నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.