BREAKING: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో లారీ, బస్సు ఢీకొని ఆరుగురు సజీవ దహనమైన ఘటన మరువకముందే.. తాజాగా ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


బుధవారం రాత్రి చిత్తూరు జిల్లాలోని బెంగళూరు హైవే మొగలిఘాట్ వద్ద లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. పలమనేరు నుండి వరిగడ్డితో ట్రాక్టర్ చిత్తూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.