దూసుకువస్తోన్న మరో మహమ్మారి వైరస్.. మరణాల రేటు 88% : WHO

2019 లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. అయితే తాజాగా మరో మహమ్మారి ప్రపంచం వైపు దూసుకు వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.


దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. అయితే డిసెంబర్ 3 నాటికే 13 కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డట్టు ఇథియోపియా ఆరోగ్యశాఖ పేర్కొంది. మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదని, దీని వల్ల మరణాల రేటు 88 శాతం ఉందని WHO తెలియజేసింది.

ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కి సరైన చికిత్స గాని, మెడిసిన్ గాని కనుగొనబడలేదు. మార్బర్గ్ ఎబోలా కంటే ప్రాణాంతకంగా వ్యాప్తి చెందటమే కాకుండా మరణాల సంఖ్యను కూడా అంచనా వేయలేమని వైద్య పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ కు టీకా గాని, ప్రత్యేక చికిత్స గాని అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్ప, అలసట తదితర వ్యాధి లక్షణాలు రోగుల్లో కనిపిస్తున్నాయని సమాచారం. కరోనా ప్రళయానికి ప్రపంచం విలవిలలాడగా.. ఇప్పుడు ఈ వైరస్ ఏం చేయబోతోందో అని భయపడుతున్నారు ప్రజలు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.