ఏపీకి వర్షాలు ఇంకా తగ్గలేదు.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలు మీదుగా ఉపరితల ఆవర్తనం సుమారు నవంబర్ 21న ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయణించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది అదే దిశగా కదులుతూ, తదుపరి రెండు రోజులలో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. మరి వచ్చే మూడు రోజుల వాతావరణం ఎలా ఉందంటే..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ:- —————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది.