Treasure Hunt: శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపద నిక్షిప్తం.. నాటి బ్రిటిష్ పాలకుల ప్రయత్నాలు ఫలించని వైనం..

www.mannamweb.com


భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక పురాతన ఆలయాలు, ప్రసిద్ది క్షేత్రాలు ఉన్నాయి. నేటికీ సైన్ చేధించని మిస్టరీలను దాచుకున్న ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం.

ఇక హిందూ దేవాలయాలు వాటి సంపద గురించి తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ప్రముఖ దేవాలయాలలోని విలువైన సంపదను దోచుకుని వెళ్ళడానికి అనేక మంది రాజులు విదేశీయులు అలయపై దండయాత్ర చేసినట్లు చరిత్ర పేర్కొంది. తిరుమల తిరపతి వెంకన్న, కేరళ అనంత పద్మనాభ స్వామీ,. పురీ జగన్నాథుడు, సోమనాథ ఆలయం ఇలా అనేక ఆలయాలు విలువైన సంపదతో అత్యంత ధనిక ఆలయాలుగా ప్రపంచ ఖ్యాతిగాంచాయి. ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి ఏడవ నేలమాళిగ రహస్యం అపరిష్కృతంగా మిలిగిపోయింది. ఇక తాజాగా పురీ జగన్నాథుడు సంపాదను లెక్కించే పనిని అధికారులు చేపట్టారు. ఇప్పటికే శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో మూడవ రత్న భాండాగారం తలపులు తెరచిన సంగతి తెలిసిందే. అయితే జగన్నాథుడు బహుదా యాత్రతో పాటు ఏకాదశి, ద్వాదశి రోజున జరగనున్న ఉత్సవాలను పురష్కరించి రత్న భాండాగారాల సంపద లెక్కింపుని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ శ్రీ క్షేత్రంలో రత్న భాండాగారం అడుగున ఒక రహస్య గది ఉందని.. దీనిలో అపార సంపద ఉందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని.. ఈ గదిలో అంతులేని విలువైన సంపద దాచినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రహస్య గదిలోకి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం కూడా ఉందని అంటున్నారు. ఎన్నికల హామీలో ఇచ్చినట్లు రత్న భాండాగారం తెరచి సంపద లెక్కింపు చేపట్టిన నేపధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ రహస్య గదిని గుర్తించే విధంగా ప్రయత్నాలు చేయాలనీ సూచిస్తున్నారు. జగన్నాథుడు సంపదపై కన్నేసిన అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ రహస్య గదిని వెళ్ళడానికి ప్రయత్నాలు చేసిందని అంటున్నారు. 902లో బ్రిటిష్ వారి పాలనలో ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేసి.. చివరకు విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు చరిత్ర కారులు.

జగన్నాథుడు విలువైన సంపద విషయంపై ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్‌ మిశ్ర మాట్లాడుతూ.. పూరీని పాలించిన రాజు కపిలేంద్రదేవ్‌ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో లెక్క లేనంత సంపదను తీసుకుని వచ్చి జగన్నాథునికి భక్తీ శ్రద్దలతో సమర్పించినట్లు చరిత్రలో ఉందన్నారు. కాలక్రమంలో పూరీని పాలించే పురుషోత్తందేవ్‌ హయాంలోనూ పురుషోత్తముడికి భారీగా నగలు, నాణేలు వంటి అపార సంపద సమకూరిందని తెలిపారు.

స్వామివారికి చెందిన ఈ అపార సంపదను భద్ర పరచడానికి పూరీ క్షేత్రంలోని రత్న భాండాగారం దిగువన ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరచి.. ఒక రహస్య గది నిర్మించారని వెల్లడించారు. ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి దేవికి సంబంధించిన వడ్డాణాలు, సుభద్రాదేవి ఆభరణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని తెలిపారు. అసలు ఈ రహస్య గదిలో రాజులు దాచిన సంపద వెలకట్టలేనిదని చెప్పారు. ఇందుకు తగిన ఆధారాలు.. పట్టాభిషేకంలో భాగంగా జగన్నాథుని గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు కొలువుదీరిన దేవతా విగ్రహాలు అని చెబుతున్నారు నరేంద్రకుమార్‌ మిశ్ర.

లోక రక్షకుడు జగన్నాథుడు సంపద విషయంపై మరో చరిత్ర కారుడు డాక్టర్‌ నరేశ్‌చంద్ర దాస్‌ మాట్లాడుతూ.. ఉత్కళ సామ్రాజ్యంపై అనేక సార్లు ముస్లింలు దండయాత్ర చేశారు. దాడులు చేసి దోచుకున్నారు. ఈ ముస్లిం దాడులనుంచి స్వామివారి సంపదను రక్షించేందుకు జగన్నాథుడు సంపదను ముస్లిం రాజులు దోచుకోకుండా అప్పటి రాజులు తగిన చర్యలు తీసుకున్నారు. స్వామి క్షేత్రంలో
రహస్య గదులు నిర్మించి.. ఆ గదుల్లో జగన్నాథుడికి రాజులు, భక్తులు ఇచ్చిన అపార సంపదను దాచినట్లు నరేశ్‌చంద్ర దాస్‌ పేర్కొన్నారు. మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఆ అపార సంపదపై కన్ను పడింది. దీంతో రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల ద్వారా 1902లో ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా రహస్య గదిలోపలకు పంపించినట్లు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తీ ఆచూకీ మళ్ళీ బ్రిటిష్ పాలకులకు లభించలేదు. దీంతో తమ ప్రయత్నాలను విరమించుకున్నారని తెలిపారు. ఇంకా ఈ విషయంపై డాక్టర్‌ నరేశ్‌చంద్ర దాస్‌ మాట్లాడుతూ శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు.. వారిని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నాయి. అయినప్పటికీ ఆ రహస్య గదుల్లోకి నేటికీ ఎవరూ అడుగు పెట్టలేక పోయారని దాస్ చెప్పారు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది.