ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. బస్సు బయలుదేరిన 20 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి వారు చెబుతున్నారు.

































