AP టెన్త్ విద్యార్థుల బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్‌లో మార్పు….

ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్‌ పరీక్షల (AP SSC Exam Date 2025) టైం టేబుల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 17 నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.


సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలతో రివైజ్‌డే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది విద్యాశాఖ. అయితే పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఎగ్జామ్స్ పూర్తి కావాల్సి ఉంది. కానీ మార్చి 31వ రంజాన్‌ సెలవు దినంగా ఏపీ ప్రభుత్వ క్యాలండర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నెలవంక కనుక మార్చి 31న కనిపిస్తే అదే రోజు రంజాన్‌ జరుపుకుంటారు. ఆ రోజున పండగ కన్ఫామ్ అయితే చివరి ఎగ్జామ్ సోషల్ పేపర్ మార్చి 31 బదులుగా ఏప్రిల్‌ 1న నిర్వహిస్తామని ఏపీ ఎగ్జామ్స్ విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. చివరి ఎగ్జామ్ ఒక్కటీ ఒక్కరోజు వెనక్కి జరిగే అవకాశం ఉందని, విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. ఆయా తేదీల్లో ఎగ్జామ్స్ (AP SSC Exams) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. ఫిజిక్స్, బయాలజీ పేపర్లు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల తెలిపారు. పరీక్షలకు మధ్య ఒక్కో రోజు గ్యాప్ ఉన్నందున విద్యార్థులు ప్రశాంతంగా రివిజన్ చేసుకోవాలని, ఒత్తిడికి గురికాకుండా పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరు కానున్న విద్యార్థులకు మంత్రి లోకేష్ సూచించారు.

ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్:

17-03-2025 (సోమవారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ – 9.30 నుంచి 12.45 వరకు

17-03-2025 (సోమవారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ – 9.30 నుంచి 12.45 వరకు

19-03-2025 (బుధవారం) – సెకండ్ ల్యాంగ్వేజ్ – 9.30 నుంచి 12.45 వరకు

21-03-2025 (శుక్రవారం) – ఇంగ్లీష్ – 9.30 నుంచి 12.45 వరకు

22-03-2025 (శనివారం) – ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ – 9.30 నుంచి 11.15 వరకు

22-03-2025 (శనివారం) – OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) – 9.30 నుంచి 12.45 వరకు

24-03-2025 (సోమవారం) – మ్యాథమేటిక్స్ – 9.30 నుంచి 12.45 వరకు

26-03-2025 (బుధవారం) – భౌతికశాస్త్రం – 9.30 నుంచి 11.30 వరకు

28-03-2025 (శుక్రవారం) – జీవశాస్త్రం – 9.30 నుంచి 11.30 వరకు

29-03-2025 (శనివారం) – OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) – 9.30 నుంచి 12.45 వరకు

29-03-2025 (శనివారం) – SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు

మార్చి 31 లేదా ఏప్రిల్ 01 – సాంఘీక శాస్త్రం – 9.30 నుంచి 12.45 వరకు